ETV Bharat / state

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం - అచ్యుతాపురం ఫార్మా ఘటనపై నివేదిక సిద్ధం - High Level Committee Report - HIGH LEVEL COMMITTEE REPORT

High Level Committee Report on escientia Pharma Company : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిందని హై లెవల్‌ కమిటీ తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఐఏఎస్​ అధికారి ఆధ్వర్యంలోని కమిటీ విచారణ జరిపింది. ప్రమాదం జరిగిన తీరుని, కారణాలను కంపెనీ ప్రతినిధులు హై లెవల్‌ కమిటీ సభ్యులకు వివరించారు.

HIGH LEVEL COMMITTEE REPORT
HIGH LEVEL COMMITTEE REPORT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 3:46 PM IST

High Level Committee Report on escientia Pharma Company : యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అనకాపల్లి జిల్లాలోని అచ్చుతాపురం సెజ్​లో ప్రమాదం జరిగిందని ఉన్నత స్థాయి కమిటీ తేల్చి చెప్పింది. జేఎన్​ ఫార్మాసిటీలోని సినర్జిన్​ ఫార్మా పరిశ్రమలో గత నెల 21న( ఆగస్టు 21న) జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్​ అధికారిణి వసుధ మిశ్రా ఛైర్మన్​గా ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీలో వివిధ శాఖల అధికారులు, నిపుణులు ఉన్నారు.

ప్రమాదానికి గురైన పరిశ్రమను పరిశీలించిన కమిటీ బృందం ఆయా శాఖల అధికారుల నుంచి నివేదికలను తెప్పించుకుంది. గత నెల 21న కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోగా, 39 మంది తీవ్రంగా గాయపడ్డిన విషయం అందరికి తెలిసిందే. పరిశ్రమలోని రియాక్టర్​లో 700 లీటర్ల మిథైల్ టైట్ బ్యూటైల్ నిల్వలు ఉండిపోవడంతో ఇప్పటివరకు కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లలేకపోయింది. ఇటీవల ఈ రసాయనాలను ఇతర వ్యర్ధాలను వేరే చోటికి తరలించారు. ఈ క్రమంలోనే ఉన్నత స్థాయి కమిటీ ప్రమాదం సంభవించిన పరవాడలోని సినర్జిన్​ ఫార్మా పరిశ్రమను బృందం పరిశీలించింది.

అచ్యుతాపురం ఫార్మా ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం - బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు - CM CBN on Pharma Company Incident

పరిశ్రమలో రసాయనం లీక్ అయిన 10 నిమిషాల వరకు పరిశ్రమ యాజమాన్యం ఈ ప్రమాదకర వాయువును గుర్తించలేకపోయిందని ఉన్నత స్థాయి కమిటీ గుర్తించింది. పైప్​ లైన్​ లీకేజీ పనులు పూర్తి చేయడానికి యాజమాన్యం ఎక్కువ సమయం తీసుకున్నారన్నట్లు వారి అధ్యయనంలో తేలింది. పరిశ్రమల్లో అనుకోని ప్రమాదాలు జరిగిన అత్యవసర మార్గాలు లేవని పేర్కొన్నారు. సెజ్​లో ప్రమాదం జరిగిన సమయంలో రెండు గోడల మధ్య చిక్కుకొని సుమారు పది మంది దాకా చనిపోయారని అధికారులు వెల్లడించారు.

అచ్యుతాపురం సెజ్​ ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్‌ - 17 మంది మృతి - Reactor Blast in Pharma Company

సినర్జిన్​ ఫార్మా పరిశ్రమలో నైపుణ్యం ఉన్న కార్మికులు లేరని ఉన్నత స్థాయి కమిటీ గుర్తించింది. రియాక్టర్​ పైపులైను ఒత్తిడిని నియంత్రించే వ్యవస్థను యాజమాన్యం ఏర్పాటు చేసుకోలేదని వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో ఎంత మంది పనిచేస్తున్నారో, వారి పేర్లు కూడా కంపెనీ యాజమాన్యం వద్ద లేవని సృష్టం చేశారు. అనుభవం లేని కార్మికులతో పరిశ్రమలో పనిచేయిస్తున్నారని కమిటీ గుర్తించింది. హై పవర్​ కమిటీకి 11 శాఖల అధికారులు తమ నివేదికలను సమర్పించారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఉన్నత స్థాయి కమిటీ వెల్లడించింది.

అనకాపల్లి ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్‌ - 15 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.