HC On MP YV Subba Reddy Petition: ఏపీలో పోలింగ్ అనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనలను నిలువరించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పోలింగ్, కౌంటింగ్ తర్వాత కొందరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దాడులపై సిట్ ద్వారా విచారణ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఘటనలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు - HC On MP YV Subba Reddy Petition - HC ON MP YV SUBBA REDDY PETITION
HC On MP YV Subba Reddy Petition: పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వైఎస్సార్సీపీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 7:25 PM IST