Hibiscus Flower changing Three colour in One day In Srikakulam District : సహజంగా పూలు రోజంతా ఒకే రంగులో కనిపిస్తాయి. సూర్యోదయం అప్పుడు తాజా వికసించి, మధ్యానం ఎండకు కొంచం వల్లిపోయినా మళ్లీ సాయంత్రానికి పొద్దున ఎలా ఉందో అదే రంగులో ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గొర్రిబంద గ్రామానికి చెందిన ఎస్.కృష్ణమూర్తి పెరటిలోని మందారం జాతి మొక్కకు చెందిన పుష్పాలు ఒకే రోజులో మూడు రంగుల్లోకి మారుతున్నాయి. నమ్మడానికి సంకొచిస్తన్నారా.. కానీ నమ్మాల్సిందే.
ఈ మందార ఉదయం తెలుపు రంగులో, మధ్యాహ్నం గులాబీ రంగు, సాయంత్రం ఎరుపు రంగులో కనిపించి అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈ మొక్కను ఒడిశా రాష్ట్రం గుణుపురం నుంచి ఏడాదిన్నర కిందట తెచ్చుకున్నానని యజమాని కృష్ణమూర్తి తెలిపారు. హైబిస్కస్ మ్యూటాబిలిస్ జాతికి చెందిన పత్తి మందారం మొక్కలు రంగులు మారుస్తాయని ఉద్యానశాఖ అధికారిణి మంగమ్మ వివరించారు. ఇవి దక్షిణ చైనాలో మాత్రమే ఉండేవని, ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయని, మన ప్రాంతంలో అరుదేనని వెల్లడించారు. ఈ మొక్కలను కాన్ఫెడరేట్ రోజ్, డిక్సి రోజ్‌మల్లౌ, కాటన్‌రోజ్, కాటన్ రోజ్‌మల్లౌ పేర్లతోనూ పిలుస్తారని పేర్కొన్నారు.
12ఏళ్ల తర్వాత విరబూసిన నీలకురింజి పువ్వులు- చూసేందుకు రెండు కళ్లు చాలవ్! - Neelakurinji Flowers
అరుదుగా కొన్ని జాతులకు చెందిన పూలు ఏడాది ఒకసారి మాత్రమే పూస్తాయి. అవి ఒకటి రెండు మాత్రమే. ఆ జాతికి చెందినదే బ్రహ్మ కమలం. ప్రతిఏటా జూన్ నెల ఆఖరిలో మాత్రమే పూసే ఈ పూలు వాతావరణంలో మార్పులు కారణంగా కొంచెం ఆలస్యంగా ఆగస్టు నెలలో పూస్తున్నాయి.కోనసీమ జిల్లా ముమ్మిడివరం పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెంలోని వెంకటేశ్వరరావు నివాసంలో ఒకేసారి 20 బ్రహ్మకమలం పువ్వులు పూయడంతో వారి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. నాలుగేళ్ల క్రితం విహారయాత్రకు కోసం అరకు వెళ్లిన కుటుంబసభ్యులు అక్కడి నుంచి మెుక్కలు తీసుకొచ్చి పెరట్లో నాటారు.
తమిళనాడు నీలగిరి జిల్లాలో 12 ఏళ్ల తర్వాత నీలకురింజి పూలు విరగబూశాయి. నీలిరంగు పూలతో నిండిన ఆ ప్రాంతాన్ని చూడటానికి రెండు కళ్లు చాలడంలేదు. ఊదా రంగుతో కిలోమీటర్ల కొలది కొండ వాలుపై పూసిన ఈ పూలు సందర్శకులను మంత్రముగ్దుల్ని చేస్తాయి.