ETV Bharat / state

వరద ఉద్ధృతికి ఉమ్మడి గుంటూరు జిల్లా అతలాకుతలం - లంక గ్రామాలు జలమయం - Flood Effect in Guntur District - FLOOD EFFECT IN GUNTUR DISTRICT

Heavy Rains in Joint Guntur District : కృష్ణానది వరద ఉద్ధృతికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు 3జిల్లాల పరిధిలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి. ముంపు బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Heavy Rains in Joint Guntur District
Heavy Rains in Joint Guntur District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 7:26 AM IST

Heavy Rains in Joint Guntur District : భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వచ్చిన వరదతో కృష్ణానది మహోద్ధృతంగా ప్రవహిస్తోంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరదనీరు నదిలో ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాలు నీట మునిగాయి. గ్రామాల్లో వరదనీరు చేరింది. పల్నాడు జిల్లా అమరావతి మండలం, గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర మండలాలు, బాపట్ల జిల్లా పరిధిలోని కొల్లూరు మండలాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది.

జలదిగ్బంధంలో లంక గ్రామాలు : అమరావతి మండలం పెదమద్దూరు గ్రామంలోకి నీరు వచ్చింది. అక్కడ నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుళ్లూరు మండలంలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దుగ్గిరాల మండలం పెదకొండూరు, మంచికలపూడి, గొడవర్రులో పంటలు మునిగిపోయాయి. తెనాలి, కొల్లిపర మండలాల్లోనూ పంటపొలాలు నీట మునిగాయి. బాపట్ల జిల్లా పరిధిలో కృష్ణానది నక్క పాయకు గండి పడింది. కొల్లూరు మండలం అరవింద వాగు సమీపంలో గండి పడటంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. కొల్లూరు మండల కేంద్రం నుంచి లంక గ్రామాలకు వెళ్లే రహదారి మూసుకుపోయింది. కొల్లూరు మండలంలో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.

కుండపోత వర్షంతో కృష్ణా జిల్లా గజగజ - చెరువులను తలపిస్తోన్న పంటపొలాలు - Heavy Rains in Krishna District

సురక్షితంగా ‍ఒడ్డుకు : బాపట్ల జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో వరద నీటిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు, జీవాలను పోలీసులు రక్షించారు. కృష్ణాజిల్లా రొయ్యూరుకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఓ మహిళ వారం రోజులుగా కృష్ణానదిలోని దిబ్బపై గొర్రెలను మేపుకుంటున్నారు. భారీ వర్షాలకు నదిలో వరద ఉద్ధృతి పెరగడంతో గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేక పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన రూరల్‌ సీఐ, ఎస్సై నదిలోకి బోటులను పంపించి గొర్రెల కాపరులు, సుమారు 1000 జీవాలను సురక్షితంగా ‍ఒడ్డుకు చేర్చారు.

వరదలతో అతలాకుతలమైన విజయవాడ - బుడమేరు ఉద్ధృతికి ప్రజల తీవ్ర ఇబ్బందులు - Floods in Vijayawada

పరవళ్లు తొక్కుతున్న జలపాతం : వరద బాధితులకు కొల్లిపర మండలంలో ఒకటి, కొల్లూరు మండలంలో 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. దుగ్గిరాల మండలం ఈమని, పెదకొండూరు గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పల్నాడు జిల్లా ఎత్తిపోతల జలపాతం భారీ వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతోంది. 70 అడుగుల ఎత్తు నుంచి వరద జాలువారుతుండటంతో ఆ దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

జలదిగ్బంధంలో విజయవాడ - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం - ఆరుగురు మృతి - HEAVY RAINS IN VIJAYAWADA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.