ETV Bharat / state

ఉమ్మడి వరంగల్, నల్గొండ​ జిల్లాలపై వరుణుడి ప్రతాపం - అస్తవ్యస్తమైన జనజీవనం - heavy rains lash joint warangal - HEAVY RAINS LASH JOINT WARANGAL

Rains in Warangal and Nalgonda Districts : ఉమ్మడి వరంగల్ జిల్లాను వాయుగుండం వణికించింది. భారీవర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె కేసముద్రం మధ్యలో కిలోమీటరుపైన రైల్వే ట్రాక్ దెబ్బతినగా అధికారులు మరమ్మతులు చేపట్టారు. ములుగు జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జన జీవజీవనం స్తంభించింది. కోదాడలో పలు కాలనీ నీటమునిగాయి. హుజూర్‌నగర్‌ నియోజవర్గంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Rains in Warangal and Nalgonda Districts
Rains in Warangal and Nalgonda Districts (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 8:55 AM IST

Heavy Rains in Warangal District : కుండపోత వర్షాలకు వచ్చిన వరదలు వరంగల్ ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేశాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. మహబూబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైన చోట సిబ్బంది మరమ్మతులు మొదలుపెట్టారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె స్టేషన్‌ల మధ్య కిలోమీటర్‌పైగా రైల్వేట్రాక్ కోతకు గురైంది. పట్టాలు గాల్లో వేలాడాయి.

పెద్దబంధం చెరువు కట్ట తెగడంతో వరదతాకిడికి మహబూబాబాద్ తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్య ట్రాక్ సుమారు 300 మీటర్ల మేర కోతకు గురైంది. అప్రమత్తమైన సిబ్బంది రైళ్లను ముందు స్టేషన్లలో నిలిపివేయగా పెనుప్రమాదం తప్పింది. కేసముద్రం ఇంటికన్నె వద్ద తాళ్లపూసపల్లి మహబూబాబాద్ మధ్యలోనూ ట్రాక్ మరమ్మతు పనులు మొదలయ్యాయి.

మహబూబాబాద్​ జిల్లా ఇనుగుర్తిలో అత్యధిక వర్షపాతం : జోరువర్షాలు, వరదలతో ఆకేరు, మున్నేరు, పాలేరు, పాకాల, వట్టి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మహబూబాద్‌ జిల్లా ఇనుగుర్తి 45.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు మత్తుడ్లు పడడంతో రహదారులపైకి నీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నెక్కొండ మండల కేంద్రంలోని వెంకటాపురం వద్ద తోపనపల్లి వాగు పొంగడంతో మహబూబాబాద్​ డిపోకు చెందిన బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. బస్సులో 40 మంది ప్రయాణికులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉదయం కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకొని బస్సులో చిక్కుకున్న 40 మందిని కాపాడారు.

మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయిగూడెం వద్ద ఆకేరు వాగులో కొట్టుకపోయిన కారు ఆచూకీ లభ్యమైంది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్‌కాపల్లి గంగారం తండాకి చెందిన తండ్రి, కుమార్తె మోతీలాల్, అశ్విని హైదరాబాద్‌కి బయలుదేరారు. పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి వారు ప్రయాణిస్తున్న కారు వాగులో కొట్టుకుపోయింది. అశ్విని మృతదేహం ఓ రైతుతోటలో లభ్యమైంది. తండ్రి మోతిలాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వరంగల్​లో నీట మునిగిన పలు ప్రాంతాలు భారీ వర్షాలకు వరంగల్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. మధుర నగర్​తో పాటు సాయి గణేష్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, ఎస్సార్ నగర్​తో పాటు గిరిప్రసాద్ నగర్ వీరన్నకుంట ప్రాంతాల్లోకి వరద చేరడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. హనుమకొండలోని ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. గిరి ప్రసాద్ నగర్ వీరన్న కుంట కాలనీవాసులను గుజరాత్ భవన్‌కి తరలించగా, మధురానగర్​లో 9 నెలల గర్భవతిని డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.

వరంగల్ జిల్లాలో భారీ వర్షాల వేళ అసహాయులకు పలువురు అండగా నిలిచారు. రాయపర్తి మండలం కాట్రపల్లిలో ఊరచెరువు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో స్ట్రక్చర్‌పై క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరదనీటిలో ద్విచక్రవాహనదారుడు కొట్టుకుపోగా పోలీసులు రక్షించారు.

ఉరకలెత్తి ప్రవహిస్తున్న జంపన్న వాగు : వర్షాలకి మొరాంఛవాగు, చలివాగు, మానేరువాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో భూపాలపల్లిలో కొన్ని గ్రామాలకు రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లిలో ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. ములుగు జిల్లాలో పలుచోట్ల రోడ్లపై వరద పోటెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. తాడ్వాయి మండలంలోని కాల్వపల్లికి చెందిన ఓ వ్యక్తి వాగులో కొట్టుకుపోయి చనిపోయాడు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సీతక్క బాధితులను పరామర్శించి ధైర్యం కల్పించారు. మేడారం వద్ద ఉరకలెత్తి ప్రవహిస్తున్న జంపన్న వాగును మంత్రి సీతక్క పరిశీలించారు.

జలవలయంలో హైదరాబాద్​ - విజయవాడ హైవే : భారీవర్షాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను ముంచెత్తాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకోగా పలువురు బాధితులను ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు సురక్షిత ప్రాంతాలకి తరలించాయి. జాతీయ రహదారిపై వరదపోటెత్తగా విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హుజూర్​నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎడతెరపి లేని వానతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మేళ్లచెరువు మండల కేంద్రంలోని నాగుల చెరువు కట్ట తెగి సుమారు 200 ఎకరాల వరి పొలాలు నీటమునిగాయి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల చెరువులో చాపలు ఎదురెక్కుతుండగా గ్రామస్తులు చేపల వేటకు వెళ్లి చేపలు పట్టారు. గోరంట్లకి చెందిన ఓ ఇద్దరికి 15 కిలోల రెండుచేపలు చిక్కాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత వానలు, వరద గుప్పెట్లో ఊళ్లు - జలదిగ్బంధంలో వందలాది ఇళ్లు - Heavy Rains in Khammam 2024

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి - హుటాహుటిన నీటిని ఆపేసిన అధికారులు - Nagarjuna Sagar Left Canal Cut Off

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.