ETV Bharat / state

ముంచుకొచ్చిన వాయుగుండం - అతి భారీ వర్ష సూచన - వెనక్కి వచ్చిన 61,756 మంది మత్స్యకారులు - AP WEATHER FORECAST

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం - 15కిలోమీటర్ల వేగంతో కదలిక

AP Weather Forecast
AP Weather Forecast (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2024, 3:32 PM IST

AP Weather Forecast : నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. చెన్నైకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 350 కిలోమీటర్లు, నెల్లూరుకి 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వెల్లడించారు. ఈ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని రోణంకి కూర్మనాథ్ వివరించారు.

పలుచోట్ల తీవ్రభారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్) సంభవించే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.

ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా యంత్రాంగానికి తీవ్రతను బట్టి సూచనలు జారీ చేస్తున్నామని రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇప్పటికే సహాయక చర్యల కోసం కోటి రూపాయల చొప్పున జిల్లాలకు అత్యవసర నిధులు ఇచ్చామని చెప్పారు. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో 4 మండలాల్లో, నెల్లూరులో 6, అన్నమయ్య జిల్లాలో 3 మండలాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపారు. అవసరమైన చోట 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన 61,756 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించామని రోణంకి కూర్మనాథ్ తెలియజేశారు.

AP Rains : మరోవైపు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌లు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడబ అప్రమత్తం చేస్తోంది. మరోవైపు విడవని వర్షంతో చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు అవస్థలు పడుతున్నారు.

"భారీ వర్షాల ఎఫెక్ట్" తిరుమల ఘాట్​రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - తిరుపతి విమానం దారి మళ్లింపు

భారీ వర్షాలపై సీఎం సమీక్ష - ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.