ETV Bharat / state

భద్రాచలంలో భారీ వర్షం - కుంగిన కల్యాణ మండపాన్ని కూల్చిన అధికారులు - BHADRACHALAM RAINS TODAY NEWS - BHADRACHALAM RAINS TODAY NEWS

Bhadrachalam Floods Today : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భద్రాచలంలోని రామాలయం పరిసరాల్లోకి భారీగా వరదనీరు చేరింది. ఆలయానికి సమీపాన ఉన్న అన్నదాన సత్రంలోకి వర్షపునీరు ప్రవేశించింది. భద్రాచలం గుట్టపై ఉన్న హరినాథ బాబా ఆలయం వద్ద కల్యాణ మండపం కుంగింది. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల, అధికారులకు ఆదేశాలు జారీ చేయగా కల్యాణ మండపాన్ని అధికారులు కూల్చివేశారు.

Heavy Rain Effect In Bhadradri kothagudem
Heavy Rain Effect In Bhadradri kothagudem (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 12:07 PM IST

Updated : Aug 7, 2024, 9:46 PM IST

Heavy Rain Effect In Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భద్రాచలంలోని రామాలయం పడమర మెట్లవద్దకు వర్షపు నీరు చేరింది. ఆ ప్రాంతంలో సుమారు 35 దుకాణాలకు వరద నీరు చేరడంతో సామగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది.

ఆలయ కల్యాణ మండపం కూల్చివేత : భద్రాచలంలోని హరినాథ బాబా ఆలయం వద్ద కొండపై కల్యాణ మండపం కుంగిపోయింది. మండపం కింద కొండను తవ్వడం వల్ల కుంగిపోయినట్లు సమాచారం. భారీ వర్షాల వల్ల కల్యాణ మండపం కిందకు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 1938లో హరినాథ బాబా ఆలయం నిర్మించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి తుమ్మల ఆరా తీసి ఆ ప్రాంతానికి వెళ్లి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్​కు ఆదేశించారు.

దీంతో హరినాథ ఆలయం కల్యాణ మండపాన్ని కలెక్టర్​, ఇతర అధికారులు పరిశీలించారు. అనంతరం కొండ కింద ఉన్న ఇళ్లు, దుకాణాల్లోని ప్రజలను ఖాళీ చేయించి పకడ్బందీ ఏర్పాట్లతో కల్యాణ మండపాన్ని కూల్చివేశారు. మరోవైపు రామాలయం వద్ద అన్నదాన సత్రంలోకి వర్షపునీరు చేరింది. దీంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. పడమరమెట్ల వద్ద వర్షపు నీట వల్ల నిలిచి ప్రయాణాలకు అంతరాయం కలిగింది.

Minister Thummala Fires On Officials : రామాలయం అన్నదాన సత్రం, విస్టా కాంప్లెక్స్‌లో వరద నీరు చేరడంపై మంత్రి తుమ్మల నీటిపారుదలశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదనీరు చేరిన వెంటనే మోటర్లు ఎందుకు ఆన్​ చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. వరద నీరు కరకట్ట స్లూయిజ్ లాకులు ఎత్తి ఖాళీ చేయాలని మంత్రి సూచించారు. ఆలయ పరిసరాల్లోకి వరదనీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Last Updated : Aug 7, 2024, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.