ETV Bharat / state

హెడ్‌ కానిస్టేబుల్‌ ఘరానా దోపిడీ - సస్పెన్షన్‌ వేటు వేసిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్ - ap latest news

Head Constable VM Basha Suspended: పోలీసులంటే ప్రజలకు రక్షణగా ఉండాలి. బాధితుల సమస్యల తీర్చాలి. కానీ కడప తాలూకా హెడ్‌ కానిస్టేబుల్‌ వీఎం బాషా మాత్రం బాధితులకే సమస్యగా మారారని ఆదుకోమని వచ్చిన వాళ్ల దగ్గరే దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్‌కు వచ్చే బాధితులతో పంచాయితీలు చేయడం, బెదిరించి డబ్బులు గుంజడం ఆయన పనిగా పెట్టుకున్నారు. సహనం కోల్పోయిన బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బాషాపై కేసు నమోదు చేసి సస్పెన్షన్‌ వేటు వేశారు.

Head_Constable_VM_Basha_Suspended
Head_Constable_VM_Basha_Suspended
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 8:45 AM IST

Updated : Feb 6, 2024, 8:56 AM IST

హెడ్‌ కానిస్టేబుల్‌ ఘరానా దోపిడీ - సస్పెన్షన్‌ వేటు వేసిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్

Head Constable VM Basha Suspended : కడప తాలూకా స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వీఎం బాషా అవినీతికి చిరునామాగా మారారు. పోలీసు బాసులను సైతం బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం, రాష్ట్ర పోలీస్​ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో అందరికీ తలనొప్పిగా మారాడు. కడపలో పలు పోలీస్ స్టేషన్​లలో పని చేసిన హెడ్ కానిస్టేబుల్, కడపలో పలువురిని బెదిరించి భూములు ఆక్రమించి, సెటిల్ మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కడప శివారులోని సర్వేనంబరు 147/E లోని 1.23 ఎకరాల భూమి రామరాజుపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డిది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని వీఎం బాషా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు 3 కోట్ల రూపాయలకు ప్లాట్ల రూపంలో విక్రయించాడు. దాదాపు 15 మందికి ఆ భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. దీంట్లో కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ సుందరేశం పాత్ర కూడా ఉందని అభియోగాలు ఉన్నాయి. దీనిపై బాధితుడు శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా మొదట స్పందించలేదు. దీంతో రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేయగా జిల్లా పోలీసులు విచారణ జరిపారు. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 30న కడప తాలూకా పోలీస్ స్టేషన్​లో బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ వీఎం బాషాపై కేసు నమోదు అయ్యింది.

15 ఏళ్లుగా మహిళతో ఏఆర్ ఎస్సై సహజీవనం - వదిలించుకునేందుకు బెదిరింపులు

వీఎం బాషాతో పాటు గజరాంపల్లె మనోహర్, గుల్జార్ బేగం, కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ సుందరేశంపై కూడా కేసు నమోదు అయ్యింది. వీళ్లందరిపై ఐపీసీ 420, 468, 471, 120-B సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ బాగోతాన్ని లోతుగా విచారణ జరిపిన పోలీసులు జిల్లా ఎస్పీకి నివేదిక ఇచ్చారు. నివేదిక ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ వీఎం బాషాను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సోమవారం సస్పెండు చేశారు.

హెడ్ కానిస్టేబుల్ వీఎం బాషాపై కేసు నమోదైందని తెలుసుకున్న పలువురు బాధితులు జిల్లా ఎస్పీని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తున్నారు. సోమవారం స్పందనలో పలువురు జిల్లా ఎస్పీకి విన్నవించారు. ఓ ముస్లిం మహిళకు డీకేటీ భూమిని 40 లక్షల రూపాయల విలువు చేసే భూమిని హెడ్ కానిస్టేబుల్ కొనుగోలు చేయించి రిజిస్ట్రేషన్ చేయించారు. అది ముందుగా డీకేటీ భూమి అనే విషయం తెలియక మహిళ ఆందోళన చెందుతోంది. వాటి కోసం 26 లక్షల రూపాయలు ఇచ్చానని, ఇపుడు ఆ భూమి తనది కాదంటున్నారని వాపోయారు. హెడ్ కానిస్టేబుల్ డబ్బులు తీసుకుని మోసం చేశాడని స్పందనలో ఫిర్యాదు చేశారు. ఇద్దరి వ్యక్తుల భూమి మధ్య పంచాయితీ కోసం సుబ్బారెడ్డి అనే వ్యక్తి నుంచి హెడ్ కానిస్టేబుల్, సీఐ 5 లక్షల రూపాయలు తీసుకున్నారని, డబ్బులు ఇచ్చినా పని కాలేదని బాధితులు సుబ్బారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

యువకులను చితకబాదిన ఐదుగురు పోలీసులపై వేటు

గతంలో లక్కిరెడ్డిపల్లెలో స్టాంపులు కుంభకోణంలో కూడా రెండేళ్ల పాటు హెడ్ కానిస్టేబుల్​ను సస్పెండు చేశారు. గతంలో ఇతనిపై ఎర్రచందనం కేసులు కూడా ఉన్నాయి. ఎర్రచందనం కేసులో గతంలో జిల్లాలో ఎస్పీ స్థాయి అధికారిని సైతం హెడ్ కానిస్టేబుల్ బ్లాక్ మెయిల్ చేశారని పలువురు పోలీసులు చర్చించుకుంటున్నారు.

సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్‌

Last Updated : Feb 6, 2024, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.