HC on Sarada Peetham Buildings Construction at TTD: విశాఖ శారదా పీఠానికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శారదా పీఠం చేపట్టిన భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శారదా పీఠం నిర్మిస్తున్న రెండు భవన నిర్మాణ పనులను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
మరోవైపు ఉల్లంఘనలు ఏ మేరకు జరిగాయో తేల్చేందుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించింది. సెట్ బ్యాక్‌కు స్థలం వదలకుండా నిర్మాణాలు చేపట్టడం తీవ్ర ఉల్లంఘన అని వ్యాఖ్యానించింది. భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం హైకోర్టు చేసింది.
టీటీడీని సందర్శించిన భారత పురావస్తు శాఖ అధికారులు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ చీఫ్ ఇంజినీర్, జేఈవో, విశాఖ శారదా పీఠం మేనేజర్‌కు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శారదా పీఠం 2 బ్లాక్‌లు నిర్మించేందుకు టీటీడీ అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ తిరు క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు టీ. ఓంకార్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిని ధర్మాసనం విచారించింది.
భవన నిర్మాణ అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఫొటోల రూపంలో ఉల్లంఘనలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం ఉల్లంఘనలు జరిగినట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది. ఇకపై నిర్మాణ పనులను చేపట్టవద్దని శారదా పీఠం, టీటీడీను ఆదేశించింది.
టీటీడీలో రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లు: ఇదిలా ఉండగా నేడు రామకృష్ణ తీర్థ ముక్కోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి పూజా సామగ్రిని తీసుకెళ్లిన టీటీడీ రామకృష్ణ తీర్థంలో శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుడి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో పాపవినాశనం మార్గంలో ప్రత్యేకంగా 35 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఆరోగ్య సమస్యలున్నవారికి అటవీప్రాంతంలో టీటీడీ అనుమతి నిరాకరించింది.
వేంకటేశ్వర స్వామి స్థానంలో జగన్ ఫొటో - జనసేన ఇన్‍ఛార్జ్ కిరణ్ ఆగ్రహం