ETV Bharat / state

తెలంగాణలో వారికి ఒంటి పూట బడులు - ఎందుకంటే! - HALF DAY SCHOOLS IN TELANGANA

ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట నిర్ణయించాలని విద్యాశాఖ నిర్ణయం

half_day_schools
HALF DAY SCHOOLS IN TELANGANA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 7:10 PM IST

Family Survey in Telangana : తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట పని చేయనున్నాయి. అసలు ఈ టైమ్​లో ఒంటిపూట బడులు ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కుల గణనకు ఉపాధ్యాయులను వినియోగించాలన్న సర్కారు నిర్ణయం మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రాథమిక పాఠశాలలు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది.

ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కులగణనకు మొత్తం పాఠశాల విద్యా శాఖ నుంచి 50 వేల మంది వరకు సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 36 వేల 559 మంది ఎస్​జీటీ, 3 వేల 414 మంది ప్రైమరీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, 6 వేల 256 మంది ఎంఆర్సీలు, 2 వేల మంది ప్రభుత్వ మినిస్టీరల్ స్టాఫ్ సహా వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల కొరత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధనా పరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలకు కులగణన నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో సర్వే పూర్తయ్యే వరకూ ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించారు.

75 రకాల ప్రశ్నలతో సర్వే: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను 6వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికీ మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు అడుగుతారు. ఈ క్రమంలో సర్వే చేసే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి ఏం ప్రశ్నలు అడుగుతారు.? ఏం సమాధానం చెప్పాలనే చాలా మంది ప్రజలు ఆలోచిస్తున్నారు. మీ సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కింద ఇచ్చే సమాచారం ఒకసారి చదవితే కుటుంబ సర్వేలే ఏం అడుగుతారో తెలుస్తుంది.

మీకున్న ఆస్తులు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. అలాగే అప్పులు ఉంటే అవి కూడా చెప్పాలి. సంవత్సరానికి వచ్చే ఆదాయమెంత, ఇంట్లో ఎంతమంది ఉంటారనే విషయాలు అడుగుతారు. ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారా, ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారా అనే వివరాలను సైతం తీసుకుంటారు. ఈ మేరకు సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్‌ నంబర్, వారు చేసే వృత్తి, ఉద్యోగ వివరాలను తీసుకుంటారు.

విదేశాలకు వెళ్తే స్పెషల్ కోడ్‌ : కుటుంబంలో ఎవరైనా విదేశాలకు వెళ్లారా లేదా, ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్లారనేది చెప్పాల్సి ఉంటుంది. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఎందుకు వెళ్లారనే వివరాలను కుటుంబ యజమానిని అడుగుతారు. విదేశాల్లో యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్లినట్లు చెబితే ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్​ను నమోదు చేస్తారు. ఏ దేశానికి వెళ్లినా ఇతర దేశం అనే కోడ్‌ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి ఎంత మంది వలస వెళ్లారు. ఏ కారణాలతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం కోసం ఈ ప్రశ్నలు రూపొందించినట్లు తెలిపారు.

అప్పులు, ఆస్తులపై : ప్రజలు తీసుకున్న రుణాలపై ప్రత్యేకంగా మూడు ప్రశ్నలు అడుగుతారు. గత ఐదేళ్లలో ఏమైనా అప్పులు తీసుకున్నారా? అని అడుగుతారు. తీసుకుంటే ఎందుకు తీసుకున్నారని, ఎక్కడి నుంచి రుణం పొందారనే ప్రశ్నలను ప్రతి కుటుంబాన్ని అడగాలని నిర్ణయించారు. బ్యాంకులు, స్వయం సహాయక సంఘాల నుంచే కాకుండా వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నారా? అనే వివరాలను కూడా చెప్పాల్సి వస్తుంది.

స్థిర, చరాస్తుల వివరాలు : కుటుంబ సభ్యులందరి స్థిర, చరాస్తుల వివరాలన్నీ చెప్పాలి. చరాస్తుల వివరాలను వేర్వేరుగా నమోదు చేస్తారు. వీటిలో బైకు, స్కూటర్, సొంత అవసరాలకు వాడే కారు, కిరాయికి తిప్పుతున్న కారు వంటివి ఉన్నాయా? ఫ్రిజ్​లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌, ఏసీలు, వాషింగ్‌ మిషన్ ఇలా మొత్తం 18 రకాల చరాస్తుల వివరాలన్నీ చెప్పాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? వాటి విలువ ఎంత అనేది సైతం తెలపాల్సి ఉంటుంది.

మీకు ఇల్లు ఉందా : మీకు ఇల్లు ఉంటే ఎన్ని గజాల్లో ఉంది. ఏ ప్రాంతంలో ఉంది? ఇంటిలో ఉన్న మొత్తం గదులెన్ని, బాత్‌రూమ్ ఉందా వంటి వివరాలన్నీ వివరించాలి. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది. అది పట్టా భూమా? లేదా ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్‌ లేదా పట్టాలేని అటవీ భూమా వంటి వివరాలు చెప్పాలి. గత ఐదేళ్లలో ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారా? ఆ పథకాల పేర్లు ఏమిటి? వంటి వివరాలు సేకరిస్తారు.

ఎవరైనా ఎన్నికయ్యారా? : కుటుంబంలో నుంచి ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా? ఎన్నికైతే రిజర్వేషన్‌లోనా, ఎన్ని పర్యాయాలు అనేది చెప్పాలి. రాష్ట్రపతి, ప్రధాని తప్ప మిగతా ఏ హోదాలో ప్రజాప్రతినిధిగా పని చేసినా అందుకు సంబంధించిన వివరాలు చెప్పాలి. వార్డు సభ్యుడి నుంచి కేంద్రమంత్రి, గవర్నర్, సీఎం దాకా ఏ పదవి పొందినా సరే నమోదు చేసుకోవాలి.

ఇంటి గోడపై స్టిక్కర్‌ : సర్వే సమయంలో ఎన్యుమరేటర్లు కుటుంబాల నుంచి స్పష్టమైన సమాచారాన్ని తీసుకోవాలి. ప్రతి ఇంట్లో నివసించే కుటుంబసభ్యుల సంఖ్య తీసుకోవాలి. సర్వే ఫారంలో యజమాని పేరు, ఇంటి నంబరు రాయాలి. సర్వే పూర్తయిన ఇంటిగోడపై స్టిక్కర్‌ అతికించాలి. సర్వే చేసిన తర్వాత ఫారాల్లో నమోదు చేసిన వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయాలి. ఈ ప్రక్రియ చాలా కీలకం. డేటా ఎంట్రీ సమర్థంగా నిర్వహిస్తేనే విశ్లేషణ కచ్చితత్వం సాధిస్తుంది. దీంతో ప్రణాళిక శాఖ అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి, వారికి శిక్షణ పూర్తి చేసింది.

సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక : రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) చేయడానికి శాసనసభ తీర్మానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు అన్నివర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపింది. ఈ సర్వేకు ప్రణాళిక శాఖ నోడల్‌ విభాగంగా వ్యవహరిస్తోంది.

సర్వేలో 80 వేల మంది ఉద్యోగులు : దాదాపు 80 వేల మంది ఉద్యోగులు సర్వేలో పాల్గొంటారు. వీరిలో విద్యా శాఖ నుంచి 48,229 మంది ఉంటారు. అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులను సైతం వీలును బట్టి సర్వేకు వినియోగిస్తారు. ఒక గ్రామంలో కనీసం 175 కుటుంబాలుంటే మొత్తంగా దాన్ని ఒకే ఈబీ (Enumeration block)గా నిర్ణయించి ఒక ఎన్యుమరేటర్​కి అప్పగిస్తారు. అంతకన్నా ఎక్కువ కుటుంబాలుంటే వాటిని చిన్న యూనిట్లుగా కనీసం ఒక్కో ఈబీలో 150 ఇళ్లను ఉండేలా విభజించి ఎన్యుమరేటర్లను నియమించి సర్వేను సకాలంలో పూర్తి చేస్తారు. ఈ నెలాఖరుకల్లా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

సమాచార ప్రైవసీ : సర్వే సమయంలో కుటుంబం నుంచి తీసుకున్న సమాచారం విషయంలో ప్రైవసీ పాటించాలని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ఈ విషయాన్ని ఎన్యుమరేటర్లు ముందుగానే యజమానికి వివరిస్తారు. ఎక్కడా ఈ సమాచారం బయటపెట్టరని హామీ ఇస్తారు. ఫారంలోని వివరాలన్నీ నింపిన తర్వాత వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఎన్యుమరేటర్లు వివరాలను డేటాఎంట్రీ కేంద్రంలోని ఆపరేటర్‌కు ఇచ్చి వాటిని పూర్తి చేయిస్తారు.

తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే - ఆ పత్రాలన్నీ రెడీ చేసుకోండి !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.