ETV Bharat / state

హైదరాబాద్‌లో గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన - లాఠీఛార్జ్‌

గ్రూప్‌-1 మెయిన్స్‌ రీషెడ్యూల్‌ చేయాలని అభ్యర్థుల ఆందోళన - అభ్యర్థులపై లాఠీఛార్జ్‌, పలువురికి గాయాలు

group 1 candidates protest
group 1 candidates protest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 4:12 PM IST

Updated : Oct 18, 2024, 5:07 PM IST

Group 1 Candidates Protest: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రీషెడ్యూల్‌ చేయాలని కోరుతూ హైదరాబాద్​లోని అశోక్‌నగర్‌లో అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో పలువురికి గాయాలయ్యాయి. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో అశోక్‌నగర్‌లో పోలీసుల పహారా కొనసాగుతోంది.

గ్రూప్‌-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్: కాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్​ 29ను రద్దు చేయాలని, గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పుల విషయంపై తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన చేస్తున్నారు. ఈ మేరకు దీనిపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు సైతం దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇటీవల అభ్యర్థుల పిటిషన్లను కొట్టేసింది. అదేవిధంగా హైకోర్టు డివిజన్ బెంచ్​లో పిటిషన్ వేయగా, సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో ఈనెల 21న గ్రూప్‌-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది.

అభ్యర్థుల ఆందోళన: మరోవైపు గ్రూప్​-1 పరీక్షలను రద్దు చేయాలంటూ అభ్యర్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గురువారం హైదరాబాద్​ గాంధీనగర్​లోని పార్కుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభ్యర్థులు పరీక్షను రద్దు చేయాలని కోరారు. గ్రూప్​-1పై ఉన్న కేసులన్నీ తొలగిన తర్వాతే మెయిన్స్​ నిర్వహించాలని, లేకుంటే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. బుధవారం రాత్రి సైతం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గూపు అభ్యర్ధులు ఒక్కసారిగా అశోక్ నగర్​లోని రహదారి పైకి వచ్చారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

జీవో 29 వివాదం: దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8వ తేదీన జీవో 29ను జారీ చేశారు. జనరల్‌ కేటగిరీలోని క్యాండిడేట్స్​ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షకు పిలవాలని కోరుతున్నారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు: తాజాగా జీవో నెంబర్​ 29ను రద్దు చేయాలని కోరుతూ గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 55నే అమలు చేయాలని కోరినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిని విచారణకు సుప్రీంకోర్టు, సోమవారానికి వాయిదా వేసింది.

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల - మెయిన్స్​ ఎప్పుడంటే! - TGPSC Group 1 prelims key

Last Updated : Oct 18, 2024, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.