Govt Action on Perni Nani Godown : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి చెందిన గిడ్డంగిలో రేషన్ బియ్యం మాయంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గోదాములోని రేషన్ బియ్యాన్ని మచిలీపట్నంలోని మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. 8 లారీల్లో లోడ్ చేసి పంపిస్తున్నారు. పొట్లపాలెంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో గోదాము నిర్మించి పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు.
సదరు గోదాములో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమవడంతో పేర్ని నాని సతీమణి జయసుధపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు సంబంధిత గోదాములోని మిగిలిన రేషన్ బియ్యం నిల్వలను మచిలీపట్నం మార్కెట్ యార్డుకు తరలిస్తున్నారు. స్టాక్ మొత్తం ఖాళీ చేశాక ఆ గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు.
Minister Kollu Ravindra on Perni Nani: పేర్ని నాని పేదల బియ్యాన్ని తిని, నీతి కబుర్లు చెప్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 90 లక్షల రూపాయలు విలువ చేసే 187 టన్నుల బియ్యాన్ని స్వాహా చేశారని దుయ్యబట్టారు. పేర్ని నాని కుటుంబం అంతా పరారీలో ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దొంగ అయిన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరమని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అంతా దొంగల పార్టీనే అని అర్ధమవుతోందని ఆక్షేపించారు.
లుక్అవుట్ నోటీసులు - మచిలీపట్నంలో పేర్ని నాని!
అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం! - ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు