ETV Bharat / state

త్వరలోనే విశాఖకు రానున్న టీసీఎస్ - స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - TCS OPERATIONS IN VISAKHAPATNAM

గతంలో డల్లాస్ టెక్నాలజీ సెంటర్‌గా ఉన్న ఎల్‌ఎల్‌పీ ప్రాంగణం టీసీఎస్‌కు కేటాయింపు - తొలిదశలో 2 వేల మందితో కార్యకలాపాలు ప్రారంభిస్తామని టీసీఎస్ ప్రతిపాదన

TCS_IN_VISAKHA
TCS OPERATIONS IN VISAKHAPATNAM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2024, 6:15 PM IST

Updated : Nov 30, 2024, 7:00 PM IST

TCS OPERATIONS IN VISAKHAPATNAM: దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎఎస్ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. విశాఖలో 2016లో ఐటీ హిల్స్ నెంబర్-2లో డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్​ఎల్​పీకి అప్పుడు 7 వేల 774 చదరపు మీటర్ల స్ధలాన్ని కేటాయించారు. ఈ ప్రాంగణంలో మూడు అంతస్ధుల భవనం ఉంది. ఇందులో 1400 మంది పని చేసేందుకు అనువుగా ఉంది.

తొలిదశలో 2 వేల మందితో కార్యకలాపాలు: డల్లాస్ టెక్నాలజీ ప్రాంగణం టీసీఎస్‌కు లీజ్‌కు ఇచ్చేందుకు అనుమతిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవంగా టీసీఎస్ తొలి దశలో రెండు వేల మందితో తన కార్యకలాపాలను ఆరంభించేందుకు సంకల్పించింది. ఈ మేరకు తమకు అనువైన ప్రాంగణాలలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ భవనాలను గుర్తించింది.

ఈ మేరకు డల్లాస్ ఎల్​ఎల్​పీ ప్రాంగణాన్ని సబ్ లీజ్​కి ఇవ్వాలని కోరింది. ఈ ప్రతిపాదన ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు ముందుకు రావడంతో దానిని ఆమోదించింది. ఎటువంటి అదనపు రుసుం లేకుండా టీసీఎస్​కి ఈ ప్రాంగణాన్ని సబ్ లీజ్​కి ఇచ్చేందుకు అనుమతించాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. అదే విధంగా అదనపు నిర్మాణాల కోసం టీసీఎస్‌కు మరో 1,600 చ.మీ. స్థలం కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ విడుదల చేశారు.

విశాఖకు టీసీఎస్‌ ఒక 'గేమ్‌ ఛేంజర్‌' : నరేష్ కుమార్

Last Updated : Nov 30, 2024, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.