ETV Bharat / state

ఊరువాడ పూజలు అందుకున్న గణనాథుడు - వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య - Ganesh Chaturthi Celebrations in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 7:16 PM IST

Ganesh Chaturthi Festival was Celebrating Grandly in AP : వినాయక చవితి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. వీధివీధి, వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి గణనాథునికి తొలి పూజలు నిర్వహించారు. వివిధ రూపాల్లో కొలువు దీరిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Ganesh Chaturthi Festival was Celebrating Grandly in AP
Ganesh Chaturthi Festival was Celebrating Grandly in AP (ETV Bharat)

Ganesh Chaturthi Festival was Celebrating Grandly in AP : రాష్ట్రవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరు, వాడల్లో గణపయ్య విగ్రహాలను ఏర్పాటు చేసి తెల్లవారుజాము నుంచే స్వామివారికి పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. పట్టణాల్లో వివిధ రూపాలలో బొజ్జ గణపయ్య భక్తులకు దర్శనమిస్తున్నారు. కొంతమంది చెరకు, అరటిపండ్లు, మొక్కజొన్న కంకులతో వినాయకున్ని తయారు చేసి ఆదర్శంగా నిలిచారు.

బాహుబలి సినిమాసెట్‌ మండపం : తిరుపతి తుమ్మలగుంటలో తమలపాకులతో భారీ వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని రక్షించే విథంగా వినాయక విగ్రహనికి చుట్టుపక్కల ప్రకృతి సోయగాలు ఉండేలా నెమళ్లు, చిలుక బొమ్మలను ఏర్పాటు చేశారు. తమలపాకులతో తయారుచేసిన వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఫొటోలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట దర్గా సెంటర్‌లో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బాహుబలి సినిమాసెట్‌ వేసి మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు.

చెవిలో కోరికలు చెబితే తీర్చే వినాయకుడు - ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా! - Vinayaka Chavithi utsavalu

అందరికీ ఆదర్శంగా : అనంతపురం జిల్లా గుంతకల్లులో ఏర్పాటు చేసిన 115 కిలోల వెండి వినాయకుడి విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పల్లకిపై పురవీధుల్లో ఊరేగించారు. పామిడికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పర్యావరణ సహిత వినాయకుడిని ఏర్పాటు చేశారు. చెరకు, అరటిపండ్లు, మొక్కజొన్న కంకులతో వినాయకున్ని తయారు చేసి ఆదర్శంగా నిలిచారు. రాయదుర్గంలోని సుప్రసిద్ధ శ్రీ దశభుజ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

సుగంధ ద్రవ్యాలతో : కడప రాజు పార్కు వద్ద నిర్మించిన అతి పెద్ద మండపంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్నూలు సహా గ్రామాలు, పట్టణాల్లో వివిధ రకాల బొజ్జ గణపయ్యలు దర్శనమిస్తున్నారు. కర్నూలులోని కురువ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంత్రి TG భరత్ ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. అడవిలో నివసిస్తూ గజ వాహనుడైన గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయ ఆవరణలో ఆరు సుగంధ ద్రవ్యాలతో శ్రీ పంచముఖ మహా గణపతిని ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా గణేశుడి సందడి - విజయవాడలో సీఎం చంద్రబాబు పూజలు - Ganesh Chathurthi 2024

పర్యావరణహిత విఘ్నేశ్వరుడు : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 61 అడుగుల మట్టి గణపతి కొలువుదీరాడు. నాగార్జున నగర్ కాలనీలో శ్రీసత్యసాయి యూత్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణహిత విఘ్నేశ్వరుడు ప్రజల పూజలు అందుకుంటున్నాడు. బంక మట్టి, గడ్డి, వెదురు బొంగులు, వరిపొట్టుతో నెల రోజులు శ్రమించి గణనాథుడిని తీర్చిదిద్దామంటున్నారు. వరదల నుంచి విజయవాడ నగరం త్వరగా కోలుకోవాలని కోరుతూ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ కందుల వారి వీధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యానంలో పిళ్లారాయగా పిలువబడే వినాయకుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

501 రూపాల్లో బొజ్జ గణపయ్య : కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీ విజ్ఞ్నేశ్వర స్వామి ఆలయంలో చవితి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంకలో వినూత్నంగా వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. పెసర విత్తనాలు, నారతో విగ్రహాన్ని తయారు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఓ భక్తురాలి ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దేశంలోనే వివిధి ప్రాంతాల్లో సేకరించిన సుమారు 501 విగ్రహాలను అందంగా అలంకరించారు. బొమ్మల కొలువులు తిలకించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

తొలిపూజలు అందుకునేందుకు సిద్ధమైన బొజ్జగణపయ్య - ఊరూవాడా కోలాహలంగా ఏకదంతుని మండపాలు - VINAYAKA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.