ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా గణేశుడి సందడి - విజయవాడలో సీఎం చంద్రబాబు పూజలు - Ganesh Chathurthi 2024 - GANESH CHATHURTHI 2024

Ganesh Chathurthi Celebrations 2024 : ఏపీలో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఏకదంతుని మండపాలతో ఊరూవాడా కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న గణనాథుని విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. భక్తులు స్వామి వారికి ఇష్టమైన నైవేథ్యాలను సమర్పిస్తున్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేశుడిని సీఎం చంద్రబాబు దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Ganesh Chathurthi Celebrations 2024
Ganesh Chathurthi Celebrations 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 2:39 PM IST

Vinayaka Chavithi Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. వాడవాడలా బొజ్జ గణపయ్య కొలువుదీరుతున్నారు. విభిన్న హంగులతో నిర్వాహకులు వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న గణనాథుని ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. జిల్లాల్లో విగ్రహాల కొనుగోళ్లు, పూజా సామగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడుతున్నాయి. బంతి, చామంతి, గులాబీ, అరటి ఆకులు, వినాయక అలంకరణతో పాటు ఇతర పూజా సామగ్రిని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు కొనుగోలు చేసి పూజకు తీసుకెళ్తున్నారు.

Chandrababu Participate Ganesh Chaturthi : వినాయకుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గణనాథుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. ఏకదంతునికి నైవేద్యాలు, కుడుములు, ఉండ్రాళ్లు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితులకు పూర్తిగా కోలుకొనే వరకూ ఇంటికి వెళ్లనన్న సీఎం చంద్రబాబు వినాయక చవితి కార్యక్రమాన్నీ విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే జరుపుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన లంబోదరుడి పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దీనికి మంత్రులు, అధికారులు కూడా హాజరయ్యారు. అనంతరం అర్చకులు చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డులో వెండి వినాయకుడు - పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు - Silver Ganesha Procession

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.