ETV Bharat / state

ఎర్రటి కొండలు - పెన్నా హోయలు - ఆహ్లాదకరమైన వాతావరణం

గండికోట పర్యాటకాభివృద్ధికి రూ.78 కోట్లు మంజూరు చేసిన కేంద్రం - త్వరలోనే గండికోటలో సీప్లేన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు చర్యలు

GANDIKOTA DEVELOPMENT
GANDIKOTA DEVELOPMENT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 8:47 PM IST

GANDIKOTA DEVELOPMENT: గ్రాండ్ కాన్యన్‌ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట వారసత్వ సంపదకు మహర్దశ రానుంది. శత్రు దుర్భేద్యమైన కోటను కాపాడేందుకు పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. 78 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఇక్కడ సీప్లేన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సుముఖత చూపడం, పర్యాటకంగా గండికోట అభివృద్ధి పథంలో నడుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

గండికోట ప్రాశస్త్యాన్ని వివరించిన పవన్: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది చారిత్రక వారసత్వ సంపద గండికోట. క్రీస్తుశకం 1123లో కాకరాజు ఈ కోటను నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నాటి రాజులు శత్రు దుర్భేద్యంగా ఈ కోటను చుట్టూ ఎత్తైన ప్రహరీతో నిర్మించుకున్నారు. ఈ వారసత్వ సంపదను కాపాడేందుకు పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి గండికోట ప్రాశస్త్యాన్ని వివరించి నిధులు మంజూరుకు విజ్ఞప్తి చేశారు.

ఏపీ పర్యాటకానికి కేంద్రం మెరుగులు - అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టు అభివృద్ధి

గండికోటకు 78 కోట్ల రూపాయలు మంజూరు: వెంటనే రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం, గండికోటకు 78 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను "స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్" ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ నిధులతో గండికోటను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర పర్యాటకశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గండికోటలో నడకదారి, అభివృద్ధికి 30 కోట్ల 96 లక్షలు, బోటు షికారు కోసం కోటి 28 లక్షలు, పర్యాటకుల వసతికల్పన కోసం 12 కోట్ల 74 లక్షల రూపాయలు వెచ్చించనున్నారు.

దీంతోపాటు గండికోటలో దర్శనీయ స్థలాలను మరింత అభివృద్ధి చేసేందుకు 15 కోట్ల 11 లక్షలు, రాత్రిపూట పర్యాటకులు ఉండేందుకు వీలుగా విద్యుత్ లైటింగ్ ఏర్పాటుకు 90 లక్షల రూపాయలు వెచ్చించనున్నారు. వారాంతంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు, విద్యార్థుల కోసం టెంట్లు, గుడారాలతో కూడిన మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. గండికోట తనకు ప్రత్యేక ప్రాజెక్టు అని, తమ పూర్వీకుల ప్రదేశంగా గండికోటకు పేరు ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రాండ్ కాన్యన్‌ ఆఫ్ ఇండియాగా గండికోటను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

గిరిజనుల్లా ఒక్కరోజైనా గడపాలనుకుంటున్నారా? - పెళ్లి కూడా చేసుకోవచ్చు!

త్వరలోనే గండికోటలో సీప్లేన్ ఏర్పాటు: చుట్టూ ఎర్రటి కొండలు, ఆ కొండలను చీల్చుకుంటే వెళ్లే పెన్నానది జలపాతం హోయలు, పచ్చని చెట్ల మధ్య కనిపించే ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో గండికోట అందాలు చూడచక్కగా ఉంటాయి. ఇదంతా గండికోట చూసేందుకు వచ్చే పర్యాటకులకు తెలిసింది ఓ వైపు మాత్రమే, కానీ దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట మూడు ప్రదేశాల్లో సాహసాలు చేసేందుకు అనువైన ప్రాంతం గండికోట అనేది కొత్త విషయం. "భూమి, గాలి, నీరు" ఈ మూడు విభాగాల్లో సాహసక్రీడలపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటైంది. గ్రాండ్ కాన్యన్‌ ఆఫ్ అమెరికా తరహాలోనే గండికోటలో కూడా మూడు చోట్ల సాహసాలు చేసే అనువైన ప్రాంతం ఉందని పర్యాటకశాఖ గుర్తించింది.

"గండికోట ఫోర్ట్​కి చాలా చారిత్రాత్మక నేపథ్యం ఉంది. దీనిని 2014 నుంచి 2019 వరకూ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గండికోటను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఇది ఒక టూరిస్ట్ స్పాట్​గా ఎంతో మంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దానిని ఇప్పుడు మరింతగా అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు ఇచ్చింది. దీని వలన రాయలసీమ ప్రాంతానికి టూరిజంగానూ, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని ఆశిస్తున్నాను". - పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్రమంత్రి

భూమిపైన చేసే ర్యాప్లింగ్, క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి ప్రదేశాలకు అందమైన కొండలు నెలవుగా మారాయి. పెన్నానది సుందరమైన జలపాతం నీటిలో చేసే సాహస క్రీడకు నెలవైంది. ఇక ఎయిర్ షో చేసేందుకు, పారాచ్యూట్ సాయంతో సాహసాలకు ఇది అనువైన ప్రాంతం. ఈ విధంగా భూమి, గాలి, నీరు మూడు విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటైంది. గండికోటకు పర్యాటక శోభ తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపడంపై జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే గండికోటలో సీప్లేన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పాడేరుకు పోదాం- ఎయిర్ బెలూన్​లో విహరిద్దాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.