Food Safety Officials Raids in Alpha Hotel : సికింద్రాబాద్‌లోని ఆల్ఫా, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, సందర్శిని హోటళ్లలో ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ హోటళ్లలో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రత ప్రమాణాలు పాటించలేదని అధికారులు గుర్తించారు. రెండు రోజలు క్రితం తనిఖీలు నిర్వహించిన అధికారులు ఇవాళ వాటికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసి కస్టమర్లకు : సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్‌తో బిర్యానీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. తయారు చేసిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి దాన్నే వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ హోటల్‌తో పాటు సందర్శిని, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లలో నాసిరకం వస్తువులతో పాటు దుర్గంధంగా ఉన్న వంటశాలను గుర్తించారు.
హోటల్లో ఎలుకలు తిరుగుతూ ఉండడం, దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు. ఆల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్‌తో పాటు ఐస్‌క్రీమ్ వంటివి ఎక్స్‌పైరీ డేట్ లేకుండా ఉన్నాయని గుర్తించిన అధికారులు ఆల్ఫా హోటల్‌కు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయలు ఫైన్ విధించారు.
సికింద్రాబాద్‌కు రోజుకూ వేలాది మంది ప్రయాణికులు వస్తూ పోతుంటారు. అక్కడ హెటల్ బిజినెస్ బాగా నడుస్తుంది. అక్కడికి షాపింగ్ కోసం వచ్చే వారు, ఇతర పనులు మీద వెళ్లిన వారు, ముఖ్యంగా విద్యార్థులు ఆల్ఫా హోటల్లో తినడానికి ఇష్టపడుతుంటారు. ఆ హోటల్లో విక్రయించే బేకరీ వస్తువులు, బిర్యానీ తినడానికి మక్కువ చూపిస్తుంటారు. తక్కువ ధరకు టేస్టీ ఫుడ్ దొరుకుతుందని ఎప్పుడు వెళ్లినా అక్కడ రద్దీగా ఉంటుంది. అయితే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలు బెంబేేలేత్తిపోతున్నారు. తాము ఎప్పుడూ తినే హోటల్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిసి భయపడి పోతున్నారు.
ప్రజల అవసరాలే ఆసరాగా : ఇటీవల ఆహార భద్రతా అధికారులు హోటళ్లలో కొరజా ఘుళిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని హోటళ్లకు నోటీసులు జారీ చేస్తూ సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు హోటళ్ల తీరును చూసి అధికారులు షాక్‌కు గురవుతున్నారు. కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నయితే పాడైన ఆహారపదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు మరికొన్ని. ఇవన్నీ చూసి ప్రజలు బయట ఫుడ్ తినాలంటే భయపడుతున్నారు. ఒకపూట కడుపు మాడ్చుకున్నా ఫర్వాలేదు ఇంటికెళ్లి వండుకుని తినాలి అని ప్రజలు నిర్ణయానికి వచ్చేలా రెస్టారెంట్ల తీరు ఉంది.
ఏంతింటున్నామో తెలుసా? - వాస్తవాలు తెలిస్తే వాంతులే! - hotel food