Fight Between Four People in Vempalli : కడప జిల్లా వేంపల్లి గండి రోడ్డులో ఆదివారం రాత్రి నలుగురు వ్యక్తుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘర్షణలో గాయపడ్డ వారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నలుగురు వ్యక్తులు వేంపల్లి శ్రీరామనగర్ కాలనీకి చెందిన శివ, శ్రీను, నరసింహగా మరొకరు వేముల మండలం భూమయ్యగారిపల్లెకు చెందిన నాగేంద్రగా పోలీసులు గుర్తించారు. గండిరోడ్డులోని పెట్రోలు బంకు సమీపంలో ఓ దుకాణం వద్ద మాట్లాడుకుంటూ మాటమాట పెరిగి కత్తులతో దాడి చేసుకున్నారని తెలిపారు. దీంతో ముగ్గురి కడుపులో కత్తిపోట్లు పడగా మరొకరికి కుడితొడపై గాయాలయ్యాయని తెలిపారు. ఘర్షణకు సంబంధించిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సీ-విజిల్లో ఫిర్యాదు - వ్యక్తిపై వైసీపీ నేత దాడి - YCP Attack C Vigil Complaint Person
Person Attack by Knife in Kadapa District : కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తాతిరెడ్డి పల్లెలో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి వేట కొడవలితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. మండలంలోని తాతిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మీనారాయణపై వెన్నపూస నారాయణ రెడ్డి అనే వ్యక్తి కొడొవలితో దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచాడు. బాధితడు లక్ష్మీనారాయణ బంధువులు అతడిని చూసి హుటాహుటిన చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజుల క్రితం లక్ష్మీనారాయణ ఇంటిలోని మహిళలతో నారాయణరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆయనపై లింగాల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడన్నారు. దీనిని మనసులో పెట్టుకున్న నారాయణరెడ్డి ఆదివారం లక్ష్మీనారాయణ తన ఇంటి బయట కూర్చుని ఉండడం చూసి వేట కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని బంధువులు తెలిపారు. దీంతో స్పృహ తప్పి పడిపోయిన అతడిని ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నారాయణరెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు.
వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లెలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా రాజశేఖర్ అనే వ్యక్తి అతని మేనమామ, మేనత్తపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరులో క్రికెట్ మ్యాచ్‌లో వివాదం- కడప నుంచి పిలిపించి దాడి - Cricket Match Dispute