ETV Bharat / state

రైతులకు 2కోట్ల అప్పు ఉన్న సీఎం జగన్- మూడు నెలలైనా చెల్లించకుండా జాప్యం - Penamaluru Farmer Suicide Attempt - PENAMALURU FARMER SUICIDE ATTEMPT

Farmers Protest To Pay Dues From Government:రైతులకు రావలసిన ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు విజయవాడలోని పౌరసరఫరాల శాఖా రాష్ట్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 21 రోజుల్లో ఆర్​బీకేల ద్వారా ధాన్యం డబ్బులు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం 2నెలలైనా చెల్లించటం లేదని రైతులు మండిపడ్డారు.

Farmers_Protest_To_Pay_Dues_From_Government

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 5:38 PM IST

Farmers Protest To Pay Dues From Government: మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరులో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రైతులకు రావలసిన 890 కోట్ల రూపాయిలను రెండు రోజుల్లో విడుదల చేయాలని, లేకపోతే ఎన్నికల సమయంలో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి ఉంటుందని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ హెచ్చరించారు. ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు విజయవాడలోని పౌర సరఫరాల శాఖా రాష్ట్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

రైతులకు 2కోట్ల అప్పు ఉన్న సీఎం జగన్- మూడు నెలలైనా చెల్లించకుండా జాప్యం

తక్షణమే ధాన్యం బకాయిలను చెల్లించాలి: లోకేశ్

విత్తనం మెుదలుకొని పంట అమ్మేవరకూ అన్నీ ఆర్​బీకే (Raithu Barosa Center) సెంటర్ల ద్వారా జరుగుతాయని చెప్పి 2నెలలు దాటినా రైతు అమ్మిన ధాన్యానికి డబ్బులు రాలేదని రైతులు మండిపడ్డారు. ఖరీఫ్ ధాన్యం డబ్బులు 21 రోజుల్లో ఇస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమయ్యిందని రైతులు, రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన కొత్తలో 10 రోజుల్లో డబ్బులు చెల్లించి రైతులను మురిపించారని ప్రస్తుతం 2నెలలు గడిచినా పట్టించుకోవటం లేదని, రైతుల డబ్బులు ఎవరి ఖాతాలకు మళ్లిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ప్రశ్నించారు. రైతుల ఆగ్రహానికి గురవ్వకుండా ఉండాలంటే తక్షణమే చెల్లింపులు జరగాలని డిమాండ్ చేశారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు కావస్తున్నా నేటికీ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. రైతు సంక్షేమం అంటే ఇదేనా అని సీఎం జగన్​ను రైతులు ప్రశ్నిస్తున్నారు.

ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ అన్నదాతల ఆందోళన

Farmer Suicide Attempt in Penamaluru: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులు నిరసన చేపట్టారు. మూడు నెలలుగా ధాన్యం బకాయిలు చెల్లించలేదని ఆందోళన (protest) నిర్వహించారు. ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని స్థానిక రైతులు తెలిపారు. 135 మంది రైతులకు సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గత సంవత్సరం ప్రకృతి విపత్తులకు జరిగిన పంటలు నష్టం కూడా వెంటనే చెల్లించాలంటూ ధర్నా నిర్వహించారు.

"రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి 21రోజుల్లోగా నగదు చెల్లిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమయ్యింది. ఆర్బీకే ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ చెల్లింపులు జరగలేదు." -రైతు

ఎమ్మెల్యే కారును అడ్డుకున్న రైతులు.. ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.