ETV Bharat / state

కొంపముంచిన పెళ్లిచూపులు - అడ్డంగా బుక్కైన నకిలీ మహిళ ఎస్సై

Fake RPF SI Malavika Arrested : తానంటే రైల్వే పోలీసుగానే అందరికి పరిచయం. పెళ్లిచూపులకు సైతం పోలీసు యూనిఫాంలోనే హాజరయ్యింది.పెళ్లి సంబంధం విషయమై యువకుడి కుటుంబీకులు, రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. విచారణలో నకిలీ పోలీసుగా తేలింది. దీంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఈ నకిలీ ఎస్సైని అరెస్టు చేశారు.

Fake_RPF_SI_Malavika_Arrested
Fake_RPF_SI_Malavika_Arrested
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 8:12 PM IST

Fake RPF SI Malavika Arrested : రైల్వే పోలీసు కావాలన్నది ఆమె ఆకాంక్ష. అందుకోసం 2018లో జరిగిన ఆర్పీఫ్ ఎస్సై పరీక్షలను రాసింది. కంటి చూపు సరిగా లేకపోవడం ఆమె పాలిట శాపంగా మారింది. ఎలాగైనా తన గ్రామంలో పేరు తెచ్చుకోవాలని, పోలీసు ఆఫీసర్‌గా ప్రజల్లో చలామణి కావాలని నిశ్చయించుకుంది. ఇందుకోసం ఆర్పీఎఫ్‌ పోలీసులు ధరించే దుస్తులు కొనుగోలు చేసి, నకిలీ గుర్తింపు కార్డును తయారుచేసుకుని రైల్వే పోలీసు అవతారమెత్తింది.

పోలీసు అవతారమెత్తాడు.. కటకటాల పాలయ్యాడు

తనకు రైల్వేలో ఎస్సైగా (Fake RPF SI) ఉద్యోగం వచ్చిందని తల్లి తండ్రులను, గ్రామస్థులను నమ్మించి ఏడాది పాటు శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌కు విధుల నిమిత్తం వెళ్లి వస్తున్నట్లు నటించింది. ఎక్కడికి వెళ్లినా యూనిఫాంలోనే వెళ్తూ, ప్రముఖులను కలిసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టింది. ఇన్స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ అందరిలో గౌరవాన్ని, నమ్మకాన్ని చూరగొన్నప్పటికి పెళ్లి చూపులకి అదే యూనిఫాంలో వెళ్లి బుక్కయింది. పెళ్లి సంబంధం విషయమై యువకుడి తరఫువారు రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించగా అసలు రంగు బయటపడి, సదరు యువతి కటకటాలపాలయ్యింది.

Fake Police: పోలీసుల పేరుతో దుండగుల దోపిడీ..రూ.50 లక్షలతో పరార్

Fake RPF SI Arrested in Narketpally : నకిలీ రైల్వే ఎస్సై వివరాలను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ సలీమా వివరించారు. నార్కట్‌పల్లికి చెందిన మాళవిక నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి అర్.పి.ఎఫ్ ఎస్సై పరీక్షలకు హాజరయ్యింది. ఆమెకు కంటి చూపు సరిగా లేక ఎస్సైగా అర్హత సాధించలేకపోయిందని.. ఎలాగైనా తన తల్లిదండ్రులు, గ్రామస్థుల ముందు పోలీస్‌గా చలామణి అవ్వాలనే ఉద్దేశంతో, నకలీ ఎస్సైగా అవతారమెత్తిందని ఎస్పీ తెలిపారు.

చివరికి పెళ్లి చూపులకు యూనిఫాంలోనే వెళ్లగా, అబ్బాయి తరఫు బంధువులు ఆర్పీఎఫ్‌లో పై అధికారులను ఆరా తీయగా, ఆమె అసలు గుట్టు బయట పడిందని ఎస్పీ సలీమా పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన నల్గొండ ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమె నకిలీ పోలీసుగా మోసపూరిత కార్యక్రమాలకు తెరలేపిందని విచారణలో స్పష్టం అయింది. వెంటనే ఆమెపై ఫిర్యాదు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్పీ సలీమా తెలిపారు. తదుపరి విచారణ అనంతరం మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.

మంచి పేరు కోసం పోలీస్​గా చలామణి- పెళ్లి చూపులతో బయటపడ్డ అసలు నిజం

"నార్కట్‌పల్లికి చెందిన మాళవిక నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, అర్.పి.ఎఫ్ ఎస్సై పరీక్షలకు హాజరయ్యింది. ఆమెకు కంటి చూపు సరిగా లేక ఎస్సైగా అర్హత సాధించలేకపోయింది. ఎలాగైనా తన తల్లిదండ్రులు, గ్రామస్థుల ముందు పోలీస్‌గా చలామణి అవ్వాలనే ఉద్దేశంతో, నకలీ ఎస్సైగా అవతారమెత్తింది. ఆమెపై ఫిర్యాదు రావడంతో, విచారించగా నకిలీ ఎస్సైగా బయటపడింది. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది".

- సలీమా, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ

పోలీసు వేషం కట్టి దోపిడీలు.. చివరికి అంతర్రాష్ట్ర ముఠా జైలుపాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.