ETV Bharat / state

'తప్పు చేస్తే నా కుమారుడ్ని శిక్షించండి - ఇలా కేసులు పెట్టి టార్చర్​ చేయకండి' - EX MLA Shakeel Son Rahil Case - EX MLA SHAKEEL SON RAHIL CASE

EX MLA Shakeel React on His Son Extra Case : తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వీడియో సందేశాన్ని విడుదల చేసారు. డీసీపీ విజయ్ కుమార్ రాజకీయ కక్షతోనో, మరే విధంగానో తమను హింసిస్తున్నారని ఆరోపించారు. కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని సిట్టింగ్​ జడ్జ్​తో పూర్తి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

Car Accident at Praja Bhavan Case
EX MLA Shakeel React on His Son Case
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 3:58 PM IST

EX MLA Shakeel Son Rahil Extra Case : బోధన్​ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహిల్​పై మరో రోడ్డు ప్రమాదం కేసు నమోదవడంతో షకీల్​ స్పందించారు. అతని సందేశాన్ని దుబాయ్ నుంచి వీడియో రూపంలో తెలియజేశారు. తన కుమారుడిపై కక్ష పూరితంగా కేసులు వేస్తున్నారని ఆరోపించారు. రాహిల్​ తప్పు ఉంటే చట్టం పరంగా ఉరి తీసిన తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అంతేకాని ఓ విద్యార్థిని నేరస్థుల మధ్యలో పెట్టి మానసిక క్షోభకు గురి చేయవద్దని వేడుకున్నారు. ఈ కేసులో సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) చొరవచూపి సిటింగ్​ జడ్జ్​తో విచారణ జరిపించాలని కోరారు.

Jubilee Hills Road Accident Case : రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడ్ని నిందుతుడిగా చేయడంపై మాజీ ఎమ్మెల్యే షకిల్(EX MLA Sakheel)​ ఖండించాడు. తన బాధను వీడియో రూపంలో ప్రజలకు తెలియజేశారు. డీసీపీ విజయ్​ కుమార్​ రాజకీయ కక్షతోనో, మరే విధంగానో తమను హింసిస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబానికి ఏదైనా జరిగితే దానికి తానే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. రాహిల్​ దుబాయ్​లో చదువుకుంటున్నాడని పారిపోయి రాలేదని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెట్టి మానసికంగా కుంగదీస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తన కుమారుడ్ని ఎన్​కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

"నేను రెండు చేతులు జోడించి రేవంత్​ రెడ్డిని కోరుతున్నాను. మా కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఏదైనా తప్పు ఉంటే శిక్షించండి. కేసులు పెట్టి బాధపెట్టకండి. ఈ విషయంలో సిట్టింగ్ జడ్జ్​తో విచారణ చేయాలని కోరుతున్నాను."-షకీల్, మాజీ ఎమ్మెల్యే

రాహిల్​పై మరో కేసు - జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదంలోనూ నిందితుడిగా నిర్ధారణ - EX MLA Shakeel Son Rahil Case

EX MLA Shakeel Son Rahil Case : గత సంవత్సరం డిసెంబరులో ప్రజాభవన్‌(Road Accident Case at Praja Bhavan) వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో రాహిల్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేయడమే కాకుండా రాహిల్‌ను కూడా అరెస్ట్‌ చేశారు.

ఈ నేపథ్యంలో అతడ్ని విచారించగా జూబ్లీహిల్స్‌లో రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసు వెలుగులోకి వచ్చింది. ప్రమాదం కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లోనూ కారు నడిపింది రాహిల్‌ అని, ప్రమాదం జరగ్గానే పరారై తన స్థానంలో ఆఫ్రాన్‌ను ఉంచినట్లు పోలీసులు అనుమానించారు. మహమ్మద్‌ మాజ్, బాధితురాలు కాజల్‌ చౌహాన్‌ తదితరుల్ని పిలిపించి వాంగ్మూలాలు తీసుకుని ఆ కారు నడిపింది రాహిల్​ అని నిర్ధారించుకున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు పునఃప్రారంభించారు. ఈ కేసులో ముగ్గురు గాయపడగా ఓ పిల్లవాడు మృతిచెందాడు.

'తప్పు ఉంటే నా కుమారుడ్ని శిక్షించండి - ఇలా కేసులు పెట్టి టార్చర్​ చేయకండి'

షకీల్‌ కుమారుడు రాహిల్​కు బిగుస్తున్న ఉచ్చు - పాత కేసు తిరగేస్తున్న పోలీసులు!

రాహిల్‌ కేసు వ్యవహారం - జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులోనూ నిందితుడు - raheel Jubilee Hills Accident case

మాజీ ఎమ్మెల్యే కుమారుడి హిట్​ అండ్​ రన్ కేసు - ఒక్కడిని తప్పించబోయి, 15 మంది నిందితులుగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.