ETV Bharat / state

కేసు పెడితే పెట్టుకోండి - నా స్థలాన్ని నేను కాపాడుకుంటా - పోలీసులపై మల్లారెడ్డి చిందులు - MALLAREDDY Land Dispute Issue - MALLAREDDY LAND DISPUTE ISSUE

Telangana EX Minister Malla Reddy Land Dispute : భూ వివాదంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి ఇతరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిలో ఫెన్సింగ్‌ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని నేను కాపాడుకుంటానంటూ మండిపడ్డారు.

Telangana EX Minister Malla Reddy Land Dispute
Telangana EX Minister Malla Reddy Land Dispute (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 12:30 PM IST

కేసు పెడితే పెట్టుకోండి - నా స్థలాన్ని నేను కాపాడుకుంటా - పోలీసులపై మల్లారెడ్డి చిందులు (ETV Bharat)

Telangana EX Minister Malla Reddy Land Dispute : హైదరాబాద్​లోని సుచిత్ర పరిధి సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి మండిపడ్డారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్‌ వేశారని దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. మరోవైపు పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

Malla Reddy Argument With Police in Hyderabad : తమ భూమిలో ఫెన్సింగ్‌ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. కేసు పెడితే పెట్టుకోండి, నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తన అనుచరులతో పోలీసుల ముందే ఫెన్సింగ్‌ను కూల్చి వేయించారు. ఇంతలోనే ఘర్షణ జరుగుతున్న భూమి తమదేనంటూ 15 మంది ఘటనా స్థలికి వచ్చారు.

Malla Reddy Viral Video : 'గొర్రెలు కాసినా.. పాలమ్మినా'.. మల్లారెడ్డి మరో వైరల్ వీడియో

Malla Reddy Land Issue : 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని ఆ 15 మంది పోలీసులకు చెప్పారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. దీంతో ఇరువురి వాదనలు విన్న పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. అనంతరం తమ భూమిపై కాంగ్రెస్ నాయకులు కొన్నేళ్లుగా కబ్జా చేయాలని చూస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. హస్తం పార్టీ అధికారంలోకి రాగానే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.