Dokka Vara Prasad Fire on Jagan : దేశాన్ని దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీలా రాష్ట్రాన్నిజగన్ దోచుకున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ధ్వజమెత్తారు. గుంటూరులో ముందస్తు క్రిస్ మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. క్రైస్తవం పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశారని ఆరోపించారు. గత ఐదేళ్ల కాలంలో క్రైస్తవుల కోసం ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. ప్రజలను దోచుకునే జగన్ క్రైస్తవాన్ని కాకుండా క్రైస్తవులంతా మదర్ థెరిస్సా, సర్ ఆర్ధన్ కాటన్ చూపిన సేవాగుణాన్ని అనుసరించాలని సూచించారు. గుంటూరులో ఉన్న క్రిస్టియన్ బిల్డింగ్ టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని, గత ప్రభుత్వం అంబేద్కర్ భవన్, అలాగే క్రైస్తవ శ్మశాన వాటికకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
ఈస్టిండియా కంపెనీలా జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఐదేళ్లలో జగన్ క్రైస్తవులకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. జగన్ హయాంలో గుంటూరులో క్రిస్టియన్ బిల్డింగ్ నిర్మించకుండా వదిలేశారు. గత ప్రభుత్వం అంబేద్కర్ భవన్, అలాగే క్రైస్తవ శ్మశాన వాటికకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి
దళితులపై జగన్ పాపాల చిట్టా రాజ్యసభ సాక్షిగా తెలిసింది: నారా లోకేశ్
వైఎస్ బిడ్డగా అవకాశం ఇస్తే అడ్డగోలుగా దోచుకున్నారు : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ స్కాంలు వెలికి తీయడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరత ఉందని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్ధసారధితో కలిసి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి సమస్యలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆర్ధిక కుంభకోణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 2019-24 మధ్య రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని మండిపడ్డారు. వైఎస్ బిడ్డగా అవకాశం ఇస్తే అడ్డగోలుగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఈసారి రెండు స్థానాలు కూడా జగన్‌కు వచ్చే అవకాశం లేదన్నారు.
జగన్ చేసిన అన్ని కుంభకోణాలపైనా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నానని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు చాలా మంది దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. కాకినాడ పోర్ట్‌ను కేవీ రావు నుంచి బెదిరించి లాక్కున్నారని, వాటిపై విచారణ చేసి కేవీ రావుకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. జగన్, అదానీ మధ్య జరిగిన ఒప్పందంలో 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, జగన్ డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని, ఈ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. దోపిడీలు చేసి ఎవరికి వారు ఆర్ధికంగా దోచుకుంటే ఎలా? అని ప్రశ్నించారు.
ప్రజల సొమ్ములను కొట్టేసిన వారిని శిక్షించాలని, జగన్ ధన దాహానికి ఇప్పుడు ప్రజలపై విద్యుత్ భారం పడిందన్నారు. 650 కోట్ల రూపాయలకు గంగవరం ప్రాజెక్టును ఎలా అప్పగించారని నిలదీశారు. అదానీ ఏమైనా నీ తల మీద తుపాకీ పెట్టి ఇవ్వమన్నారా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో అత్యంత దారుణంగా, నిస్సిగ్గుగా దోపిడీ చేశారని, ప్రభుత్వంలో జగన్ స్కాంలపై ఒక్కో విషయం తెలుస్తుంటే మతి పోతుందన్నారు. విశాఖలో అడ్డగోలుగా భూములను దోచుకున్నారని, ప్రైవేటు ఆస్తులను కూడా బలవంతంగా లాక్కున్నారని విమర్శించారు.
అంతా లెక్కల గారడీ - అదానీ విద్యుత్ కొనడం కోసం వైఎస్సార్సీపీ కుట్రలు