ETV Hyderabad Bureau Chief Adinarayana Passed Away :సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ కన్నుమూశారు. అపార్ట్మెంట్పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా ప్రముఖులు సంతాపం తెలిపారు. నారాయణ ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Shocked and saddened to learn about the sudden passing of ETV Hyderabad Bureau Chief Adinarayana Garu. He was a bright, honest and hardworking journalist who always strived to make a difference to the society. His absence will be deeply felt. pic.twitter.com/vUqtdpfO3o
— N Chandrababu Naidu (@ncbn) September 26, 2024
సమాజం మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి : ఆదినారాయణ మరణం పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిబద్ధత కలిగిన ఆయన, సమాజంలో మార్పునకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. నారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉన్న జర్నలిస్ట్ నారాయణ అని కొనియాడారు. ఇటీవలి కాలంలో అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటారని ఆశించానని, ఆయన అనారోగ్యం నుంచి కోలుకునేలోపే మరణ వార్త వినడం చాలా బాధాకరమన్నారు. ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఎలక్ట్రానిక్ మీడియా సీరియర్ జర్నలిస్టు
— Revanth Reddy (@revanth_anumula) September 26, 2024
ఈటీవీ బ్యూరో చీఫ్ నారాయణ అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ…
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/JD3ZdPVgIh
వృత్తిపట్ల నిబద్ధత, క్రమశిక్షణ : ఆదినారాయణ మృతి పట్ల వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వృత్తిపరంగా పలు సందర్భాల్లో తనతో మాట్లాడేవారని గుర్తు చేశారు. వృత్తిపట్ల నిబద్ధత, క్రమశిక్షణ పాటించేవారని కొనియాడారు.
నిబద్ధత గల జర్నలిస్టును కోల్పోయం : నారాయణ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బాధాతప్త హృదయంతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రెండున్నర దశాబ్దాలుగా ఈటీవీలో పని చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నిబద్ధత గల జర్నలిస్టును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదినారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
— Lokesh Nara (@naralokesh) September 26, 2024
వారికి బాధాతప్త హృదయంతో అశ్రునివాళులు అర్పిస్తున్నాను. రెండున్నర దశాబ్దాలుగా ఈటీవీలో పని చేస్తూ జనం సమస్యల పరిష్కారానికి కృషిచేసిన నిబద్ధతగల జర్నలిస్టుని కోల్పోయాం.… pic.twitter.com/yOlvgJJjVR
ఆదినారాయణ మృతి పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సంతాపం తెలిపింది. ఆయన మృతి బాధకరమని మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు, శాప్ ఛైర్మన్ రవినాయుడు, దేవినేని ఉమ విచారం వ్యక్తం చేశారు.
ప్రముఖుల సంతాపం : ఆదినారాయణ మృతి పట్ల మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సంతాపం తెలిపారు. చిన్న వయస్సులోనే ఆయన మరణించడం చాలా బాధాకరమని కేటీఆర్ అన్నారు. ఆయన అకాల మరణం చాలా బాధించిందని హరీశ్ రావు తెలిపారు. ఆదినారాయణ మరణం పట్ల మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్, తుమ్మల సంతాపం ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం సంతాపం తెలిపారు.
సీనియర్ జర్నలిస్టు, ఈటీవీ బ్యూరో చీఫ్ గా సుదీర్ఘకాలం సేవలందించిన నారాయణ గారి అకాల మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/LajZf27aUw
— Harish Rao Thanneeru (@BRSHarish) September 26, 2024