Land Grabs in North Andhra: విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కడప ఫ్యాక్షనిస్టులు ప్రవేశించి ఇక్కడి ప్రజలను బతకనివ్వరని 2014లోనే జగన్ సహచరుడు, మాజీ ఎంపీ సబ్బంహరి హెచ్చరించారు. సరిగ్గా పదేళ్ల తర్వాత ఆయన చెప్పినట్టే జరుగుతోంది. వైఎస్సార్సీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావే స్వయంగా ఆ విషయం వెల్లడించారు.
శాంతికి, సామరస్య జీవనానికి ప్రతీక అయిన విశాఖతో పాటు ఉత్తరాంధ్ర కూడా ఈరోజు అధికారపార్టీ నేతల కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఉత్తరాంధ్రలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ఫ్యాక్షనిస్టులు. జగన్ సీఎం అయ్యాక ఉత్తరాంధ్రలో ఏం జరిగింది. ఏం జరుగుతోంది అనే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపిన జగన్‌కు ఎందుకు ఓటేయాలి?
ఈ చర్చలో విశాఖ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది పి.శ్రీరామ్‌మూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి లోకనాథం పాల్గొన్నారు. మంత్రి ధర్మాన చెప్తున్న విధంగానే, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయా అని చర్చించారు. విశాఖలో ల్యాండ్ మాఫియాతో స్వయంగా తనకే రక్షణ లేదని వైఎస్సార్సీపీ ఎంపీ సత్యనారాయణ స్వయంగా చెబుతున్నారు. ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నలపై చర్చ నిర్వహించారు.
విశాఖలో వైఎస్సార్సీపీ అరాచకశక్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేశారంటే, వైఎస్సార్సీపీ అరాచకాల గురించి జాతీయ స్థాయిలో తెలిసిపోయింది. ఉత్తరాంధ్ర ప్రజలు ఇందుకేనా జగన్‌ను సీఎం చేసింది అనే ప్రశ్నలపై చర్చించారు.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యానికి బాధ్యులెవరు ?
విశాఖను పాలనా రాజధాని చేస్తానని చెప్పినా కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఎందుకు ఓడిపోయింది. ప్రజలు ఎందుకు విశ్వసించలేదనే అంశంపై ప్రతిధ్వని చర్చ నిర్వహించారు. హుద్‌హుద్ తుఫాన్ వల్ల విశాఖ కైలాసగిరిపై వేల చెట్లు నేలకూలాయి. కానీ నాటి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మళ్లీ పచ్చదనాన్ని పునరుద్ధరించింది. ఈ ప్రభుత్వం వచ్చాకా ఉన్న రుషికొండను గుండుకొట్టింది. వైఎస్సార్సీపీ గెలిస్తే ఇంతపచ్చిగా విశాఖను విధ్వంసం చేస్తారని ప్రజలెవరైనా ఊహించారా అని చర్చలు జరిపారు.
ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేసినప్పుడు జగన్ ఏవేం హామీలు ఇచ్చారనే అంశాలతో పాటు, వాటిలో ఎన్నింటిని పూర్తి చేశారు అనే విషయాలపై చర్చ నిర్వహించారు. పాలన రాజధాని అని ప్రజలను ప్రలోభపెడితే ఓట్లు పడతాయని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఎన్నికల ముంగిట జనం ఏం ఆలోచిస్తున్నారనే విషయంపై చర్చ కొనసాగించారు. గడిచిన ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనపై ఉత్తరాంధ్ర వాసులు ఏం అనుకుంటున్నారు. మళ్లీ వైఎస్సార్సీపీ గెలిస్తే ఉత్తరాంధ్ర భవిష్యత్ ఏంటనే అంశంపై చర్చ నిర్వహించారు.
డీప్‌ఫేక్ - కొంప ముంచబోతోందా? విలువలు, భద్రతాపరమైన అంశాల మాటేంటి?