ETV Bharat / state

అనంతపురం జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు - సమస్యలపై ఫిర్యాదు చేయాలన్న అధికారులు - Command control center - COMMAND CONTROL CENTER

Establishing Command Control Center for Public Complaints: ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అవగాహన ఉండాలని ఎన్నికల అధికారి వినోద్ కుమార్ అన్నారు. నియోజకవర్గాల వారీగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రజలు ఇతరత్రా సమస్యలు ఏమి ఉన్నా కంట్రోల్ రూమ్​కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Establishing Command Control Center for Public Complaints

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 7:49 PM IST

Establishing Command Control Center for Public Complaints: ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ అన్నారు. ఇప్పటికే ప్రతి ప్రాంతంలోనూ అవగాహన కల్పిస్తున్నామని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్​ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నియోజకవర్గాల వారీగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రజలు ఇతరత్రా సమస్యలు ఉన్న కంట్రోల్ రూమ్​కు ఫిర్యాదు చేయాలని కోరారు.

సార్వత్రిక ఎన్నికల కోసం అనంతపురం జిల్లా కలెక్టరేట్​లో కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఇదే విధంగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కంట్రోల్ రూమ్​లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్​తోపాటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్​లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వినోద్​ కుమార్​ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుని ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు తెలపాలన్నారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫోన్ నంబర్ల వివరాలు

1. 18004258802 (OR) 08554-234122.

2. 18004258803 (OR) 08554-239822.

3. 18004258804 (OR) 08554-231722.

అసెంబ్లీ నియోజకవర్గాల కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ల వివరాలు ఇలా:

1. 148 - రాయదుర్గం : 8495252001.

2. 149 - ఉరవకొండ : 8496357846.

3. 150 - గుంతకల్లు : 8552223355.

4. 151 - తాడిపత్రి : 9642338578.

5. 152 - సింగనమల : 8919003100.

6. 153 - అనంతపురం అర్బన్ : 08554 - 230139.

7. 154 - కళ్యాణదుర్గం : 08497 - 220422.

8. 155 - రాప్తాడు : 8554291001.

ఎన్నికలకు సంబంధించిన ఏ ఫిర్యాదులైనా పైనా ఇచ్చిన ఆ నియోజకవర్గ కంట్రోల్​ రూమ్​కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. నగదు లావాదేవీలు, కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయలు జరగకుండా చూసేందుకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.