Emotional Scenes During Chandrababu Swearing Ceremony: చంద్రబాబు సహా మంత్రుల ప్రమాణ స్వీకారం వేళ భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఆత్మీయుల ప్రమాణస్వీకారంతో కుటుంబసభ్యుల ఆనందాన్నికి అవధుల్లేవు. ఇవాళ జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవంలో ఎన్నో అపూర్వ ఘట్టాలు తారసపడ్డాయి. ఆ మధుర క్షణాలు మీరు చూసేయండి. చంద్రబాబు పట్టాభిషేకంలో ఎన్నో ఆనంద క్షణాలు దర్శనమిచ్చాయి.
'చంద్రబాబు అనే నేను' అనగానే ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తుండగా నందమూరి రామకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. చంద్రబాబును దగ్గరకు తీసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారంతో పవన్ ఫ్యాన్స్‌కు, జనసైనికులకు పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. జనసేనాని ప్రమాణం చేస్తుండగా జనసేన నేతలు, అభిమానులు ఈలలు వేస్తూ సందడి చేశారు. పవన్‌ను చూస్తూ చిరంజీవి మురిసిపోయారు. పవన్ ప్రమాణ స్వీకారాన్ని ఆయన సతీమణి 'అన్నా లెజ్నోవా' వీడియో తీస్తూ హర్షం వ్యక్తం చేశారు.
ప్రమాణస్వీకారం అనంతరం పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు. తమ్ముడిని చిరు ఆత్మీయంగా గుండెలకు హత్తుకున్నారు. పవన్ కల్యాణ్ ప్రమాణానికి కుటుంబ సభ్యులంతా తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ ప్రత్యేక వాహనాల్లో సభా వేదిక వద్దకు రాగా నాగబాబు, సాయిధర్మతేజ్, అకీరాతో సహా ఇతరులు బస్సులో వచ్చారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం- మోదీ ఆత్మీయ ఆలింగనం - ap new cm cbn
మంత్రిగా లోకేశ్ ప్రమాణ స్వీకార సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు పసుపు కండువాలు గాల్లోకి ఎగరేస్తూ ఈలలు వేస్తూతో సందడి చేశారు. లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు పట్టాభిషేకానికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి హాజరయ్యారు. వేదికపైకి చేరుకున్న ఆమె సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భువనేశ్వరి వద్దకు వచ్చి ఆశీర్వచనం అందించారు. చెల్లిని పలకరించి ఆత్మీయంగా నుదుటిపై ముద్దు పెట్టారు.
పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారానికి తరలి వచ్చిన మెగా ఫ్యామిలీ - Pawan Kalyan daughter Aadhya
ప్రమాణస్వీకారం తర్వాత సభా వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫొటో దిగాలని ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ కోరగా అందుకు ఆయన సమ్మతించారు. వెంటనే దూరాన ఉన్న చిరంజీవి దగ్గరికి వెళ్లి మరీ ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ ఫొటో దిగారు. అన్నదమ్ముల చేతులు పైకెత్తి ఫొటో తీసుకున్నారు. మెగా బ్రదర్స్‌తో ముచ్చటించారు. తండ్రి, బాబాయ్‌లను చూస్తూ రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు.
వైఎస్సార్సీపీ లెక్కలు తేల్చిన పవన్- ఏపీ రాజకీయాల్లో పెను తుపాన్ - sensation in AP politics