Election Campaign in NDA Alliance Leaders: ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ప్రచారంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోంది. అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి భారీ సంఖ్యలో టీడీపీలోకి వలస వస్తున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేచర్లలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ కార్యకర్తలతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చినగంజాం మండలంలోని గ్రామాల్లో గడపగడపకూ వెళ్లి సూపర్‌సిక్స్ పథకాలు వివరించారు. అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవి సంతమాగులూరు మండలంలోని గ్రామాల్లో ప్రచారం నిర్వహించగా జోరువానను సైతం లెక్కచేయకుండా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
యువకులతో ద్విచక్రవాహనంపై ర్యాలీ: ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సతీమణి శిరీష ఇంటింటి ప్రచారం చేశారు. విజయవాడ పశ్చిమలో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ నేతలు పెద్దఎత్తున టీడీపీలో చేరారు. విశాఖ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ భవన నిర్మాణదార్లు, సగర కులస్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. భీమునిపట్నం మండలంలో గంటా శ్రీనివాసరావుకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో గంటాకు మద్దతుగా సినీనటి నమిత పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు, జి.సిగడాం మండలాలకు చెందిన వంద కుటుంబాలు వైసీపీని వీడి బీజేపీలో చేరాయి. టెక్కలి టీడీపీ అభ్యర్థి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని 46 గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. యువకులతో కలిసి ద్విచక్రవాహనంపై ర్యాలీ చేశారు.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబి నాయన దివ్యాంగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చింతలపూడి మండలంలో టీడీపీ అభ్యర్థి రోషన్ కుమార్, ఏలూరు లోక్‌సభ అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్‌తో కలిసి జోరుగా ప్రచారం చేశారు. ప్రచారంలో సుమారు 150 మంది వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అమలాపురం లోక్‌సభ అభ్యర్థి గంటి హరీశ్, అసెంబ్లీ అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు కూటమి కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పెద్దపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో సమావేశం నిర్విహించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. నర్సీపట్నం అభ్యర్థి అయ్యనపాత్రుడుతో కలిసి వేములపూడిలో ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. పార్వతిపురం జిల్లా పాచిపెంటలో టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేశ్ వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. జలదంకిలో సినీ నటుడు నారా రోహిత్ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేశ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. రోడ్‌షోకు మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి అస్మిత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పలువార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. నార్పల మండలంలోని పలుగ్రామాల్లో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి తరఫున ఆమె సోదరి కిన్నెర శ్రీ భారీ రోడ్‌షో నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ప్రచారానికి ప్రజలు పెద్దఎత్తున హాజరైయ్యారు.
కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తరఫున ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఎన్నికల ప్రచారం చేశారు. ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నంద్యాల లోక్‌సభ అభ్యర్థి బైరెడ్డి శబరి దూదేకుల ప్రతినిదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పత్తికొండ టీడీపీ అభ్యర్థి శ్యాంబాబు ఇంటింటికీ వెళ్లి టీడీపీ సూపర్‌సిక్స్ పథకాలు వివరించారు.
వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రిలో పుత్తా చైతన్యరెడ్డి నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ తరఫున సినీ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థి VM థామస్ ప్రచారంలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లిలో భారీ ఊరేగింపుతో వెళ్తున్న థామస్‌ను వైసీపీ జెండాలు ఊపి రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
ట్రెండ్ మారింది గురూ- టీడీపీ తరఫున ఎలక్ట్రిక్ సైకిళ్లతో యువత ప్రచారం - ELECTION CAMPAIGN 2024