Education Minister Botcha Satyanarayana: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే వివిధ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అందుకు సంబంధించి అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి నెల మెుత్తం పలురకాల పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు మంత్రి సూచనలు చేశారు. ఆయా విభాగాలకు చెందిన అధికారులంతా కలిసి పరీక్షల నిర్వాహణలో సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
మార్చి నెలంతా పరీక్షలు: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ , ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు అధికారులంతా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీసు, వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మార్చి నెల అంతా 20 లక్షల మంది విద్యార్ధులు వివిధ పరీక్షలకు హాజరవుతారని దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలోని అధికారులంతా పరీక్షా కేంద్రాల్లోని ఏర్పాట్లను ముందుగానే పరిశీలించాలని మంత్రి బొత్స సూచించారు.
ఈ-ఏపీసెట్ పరీక్షల తేదీ ప్రకటించిన విద్యాశాఖ- షెడ్యూల్ ఇదే
మొబైల్ ఫోన్లకు అనుమతి ఇవ్వొద్దు: ఇంటర్ పరీక్షలు 1559 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని వీటికి 10,52,221మంది విద్యార్థులు హాజరవుతారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేయాలని బొత్స సూచించారు. పరీక్షా కేంద్రాలకు దగ్గర్లో ఎలాంటి జిరాక్సు దుకాణాలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపారు. అదే సమయంలో పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లకు అనుమతి ఇవ్వొద్దని సూచించారు.
టెట్, టీఆర్టీని ప్రభుత్వం హడావుడిగా నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది: హైకోర్టు
6.23 లక్షల మంది విద్యార్ధులకు 3423 పరీక్షా కేంద్రాలు: మార్చి 18 తేదీ నుంచి మార్చి 30 తేదీ వరకూ ఉదయం 9.30 గంటల నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని మంత్రి బొత్స స్పష్టం చేశారు. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్ధులకు 3423 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాస్తారని తెలిపారు. వీరితో పాటు రీఎన్రోల్ చేసుకున్న మరో 1.02 లక్షల మంది విద్యార్ధులు కూడా హాజరవుతారని మంత్రి వెల్లడిచారు. దీంతో పాటు ఓపెన్ స్కూల్ ఏపీ టెట్ పరీక్షలు 120 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్టు బొత్స తెలిపారు. ఏపీ ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షకు సుమారు 2,79,685 మంది హాజరవుతారని పేర్కొన్నారు. ఏపీ టెట్ పరీక్ష సీబీటీ విధానంలో పరీక్ష జరుగుతుందని, ఏపీతో పాటు బెంగుళూరు, బరంపురం, చెన్నై, హైదరాబాద్, ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి బొత్ససత్యనారాయణ వెల్లడించారు.
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే?