AP government on pension distribution: పెన్షన్ల పంపిణీ వ్యవహారంపై మరోమారు ఎన్నికల సంఘం రాష్ట్రప్రభుత్వానికి స్పష్టత ఇచ్చింది. లబ్దిదారులు ఇబ్బందులు పడకుండా అసౌకర్యానికి గురికాకుండా చూడాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. నగదు బదిలీ పథకంగా ఉన్న పెన్షన్ పంపిణీకి గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాల్సిందిగా సూచనలు చేసింది. కోడ్ ఉల్లంఘనలకు తావులేకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.
పెన్షన్ పంపిణీకీ ప్రత్యామ్నాయ మార్గాలు సూచించినా పట్టించుకోకుండా లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేయటంపై ఈసీ రాష్ట్రప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. గతంలో మార్చి 30 తేదీన జారీ చేసిన మార్గదర్శకాలను మరోమారు పరిశీలించాలని సీఎస్ జవహర్ రెడ్డికి సూచించింది. పెన్షన్ లాంటి నగదు బదిలీ పథకాల పంపిణీని ఎలక్ట్రానిక్ ట్రాన్సఫర్ లేదా శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని సూచించినా ఆ మార్గాన్ని ఎందుకు అనుసరించలేదని ఎన్నికల సంఘం ఆక్షేపించింది. పెన్షన్ పంపిణీ లో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఎన్నికల సంఘం సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. పెన్షన్ పంపిణీ లాంటి నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు మార్చి 30 తేదీనే జారీ చేసినట్టు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టి కోణంతో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ తేల్చి చెప్పింది.
మే నెల ఫించన్ ఇంటింటికి పంచడం కష్టమా- పేదలను ఇబ్బందులకు గురిచేయొద్దు : బీజేపీ - PENSION DISTRIBUTION
పెన్షన్ ను శాశ్వత ఉద్యోగుల తో పంపిణీ చేయించ వచ్చనీ గత ఆదేశాల్లో స్పష్టం చేశామని వెల్లడించింది. పెన్షన్ పంపిణీ లో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల సంఘం పేర్కోంది. మరోవైపు పెన్షన్ పంపిణీ లో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్టుగా, అసౌకర్యానికి గురైనట్టుగా తమ దృష్టికి వచ్చిందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీ తో పాటు ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయొచ్చని గత మార్గదర్శకాల్లోనే చెప్పామని వెల్లడించింది. గతంలో పంపిన మార్గదర్శకాల్లోని పేరా ను కూడా ప్రస్తుత లేఖలో ఊటంకిస్తూ సీఎస్ కు మరోమారు ఆదేశాలు జారీ చేసింది.
సరైన సౌకర్యాలు, మార్పిడి చేసిన ఏర్పాట్లపై వివరాలు లేకపోవటంతో సామాజిక పెన్షన్లు తీసుకుంటున్న లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారని ఈసీ తన లేఖలో పేర్కోంది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా , ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీకి గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను వాస్తవిక దృష్టికోణంతో ఆలోచించి ఏర్పాట్లు చేయాల్సిందిగా మరోమారు సూచించింది. ఎన్నికల నియమావళి అమలు లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలనీ ఈసీ సూచనలు ఇచ్చింది.