ETV Bharat / state

విజయనగరంలో దాహం కేకలు- వేసవికి ముందే మొదలైన నీటి కష్టాలు - Water problem in Vizianagaram

Drinking Water Problem in Vizianagaram District : ఇంటింటికీ కుళాయిలు వేస్తాం, ప్రతి ఒక్కరికి తాగునీరు అందిస్తాం, ఎక్కడా కూడా నీటి కష్టం లేకుండా చుస్తాం. ఇవీ ముఖ్యమంత్రి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు వరకు చెబుతున్న మాటలు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంకా వేసవి కాలం మెుదలు కాకముందే విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలు తాగేందుకు నీరులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాల్లో మారుమూల గ్రామాల నుంటి పట్టణాల వరకు ఇదే పరిస్థితి నెలకొంది.

Drinking_Water_Problem_in_Vizianagaram_District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 6:08 PM IST

Drinking Water Problem in Vizianagaram District : వేసవి కాలం మెుదలు కాకముందే రాష్ట్ర ప్రజలుకు తాగునీటి కష్టాలు మెుదలయ్యాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు తాగేందుకు నీరు లేక తీవ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. జిల్లాలో తాగునీటి అవసరాల కోసం గత ప్రభుత్వ హయాంలో ట్యాంకులు నిర్మించారు. ట్యాంకల వద్దకు పైపులైన్లు వేస్తామని అధికారంలోకి తొలినాళ్లలో వైసీపీ నేతలు ప్రకటించారు. ఇప్పటి వరకు నీటిని తీసుకెళ్ల పైపులైన్లు వేయలేదు. దీంతో నగరాలలకు ఇప్పటికీ ట్యాంకర్లు వెళ్తే గానీ ప్రజల దాహం తీరని పరిస్థితి నెలకొంది. మరోవైపు జలాశయాల్లోనూ నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో నీటి సమస్య ఎంత తీవ్ర రూపం దాల్చుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో దాహం కేకలు..ఒక్కో బావిపై 50వరకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు

విజయనగరంలో వేసవికాలం మెుదలుకాకముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. చివరికి రోజులో ఎప్పుడో ఒకప్పుడు వచ్చే కుళాయిలు సైతం పని చేయటం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో ప్రజలు ఇప్పటికి వందేళ్ల నాటి రాణి అప్పలకొండయాంబ నీటి పథకంపైనే ఆధారపడుతున్నారు. అలాగే రామతీర్ధం ప్రాజెక్ట్ వద్ద ఉన్న ఐదు మోటర్లలో కేవలం మూడే పనిచేస్తున్నాయి. అదేవిధంగా ముషిడిపల్లి నీటి పథకం నుంచి నగరంలోని దాదాపు 29 డివిజన్లకు నీటి సరఫర జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ నీటి లభ్యత అంతంత మాత్రమే ఉంది. దీంతో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. చివరికి వీటి ద్వారా ఉన్న ప్రధాన పైపులైన్లు రోజు మరమ్మతులకు గురవుతున్నాయి.

Water Problem in Parvathipuram Manyam District : నగరంలో గతంలో వేసిన కుళాయిల్లో 30శాతానికి పైబడి నిరుపయోగంగా మారాయి. ముఖ్యంగా నగరంలో బీసీ కాలనీ, ప్రశాంతనగర్, పీవీజీనగర్, సీఆర్ కాలనీ, నానాజాతులపేట, అశోక్ నగర్, లంకాపట్నం, స్టేడియం పేట, స్టేడియం కాలనీ, సున్నపుబట్టీల వీధి, జొన్నగుడ్డి, ధర్మపురి, తోటపాలెం, కణపాక ప్రాంతాల ప్రజలు నీటి సమస్యతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.

గొంతెండుతోంది.. తాగునీటి సమస్యతో అల్లాడుతున్న జనం

అదేవిధంగా మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురంలోనూ రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తున్నారు. ప్రజలకు సరిపడనీరు లేక తోటపల్లి వద్ద ఉన్న నాగావళి నదిలోని బావుల నుంచి పట్టణంలోకి నీటి సరఫరా జరుగుతోంది. వర్షాకాలంలో నది ఉప్పొంగితే బావుల్లోకి మురికి నీరు చేరుతోంది. అలాగే నగరంలోని బెలగాం, కొత్తబెలగాం, జగన్నాథపురం, కొత్తవలస, సాయినగర్ కాలనీ, చాకలి బెలగాం, బంగారమ్మకాలనీ, నాయుడువీధి, చర్చి వీధి, అగ్రహారం వీధి, వైకేఎం కాలనీ తదితర ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. గత టీడీపీ హయంలో మంజురైన రూ. 63.63 కోట్ల విలువైన తాగునీటి పథకం పనులు వైఎస్సార్సీపీ వచ్చాక మందగించాయి. దీంతో పార్వతీపురంలోని పలు కాలనీల్లో తాగునీటి సమస్య ఏడాది పొడవున కొనసాగుతుంది.

Water Crisis in AP : మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తిరిగే విజయనగరం, పార్వతీపురం జిల్లా కేంద్రాల్లో వేసవి రాకముందే నీటి ఎద్దడి నెలకొంది. పథకాలు సక్రమంగా పనిచేయకపోవటంతో ఇప్పటికే చాలాచోట్ల సరఫరా తగ్గిపోయింది. కొన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో నీరు ఆగిపోయింది. దీంతో ప్రజలకు ట్యాంకర్లు, చేతిపంపులే దిక్కవుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న వేసవి తాపం దృష్ట్యా సమస్య తీవ్రతరం కాకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.