Dog Show at Vijayawada : రోడ్డుపై భౌ భౌ అంటూ అందరిపై అరిచే శునకాలు అందంగా ముస్తాబు అయ్యాయి. చక్కగా చొక్కా, గౌనుతో సోకు చేసుకుని షోకు రెడీ అయ్యాయి. డాగ్ షో లో పాల్గొన్న వారిని ఎంతో ఆకర్షించాయి.
జంతు పోషకులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఫ్లీ ల్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన డాగ్ షో ఆకట్టుకుంది. నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన జంతు ప్రేమికులు తాము ప్రేమతో పెంచుకుంటోన్న శునకాలతో కలిసి పోటీల్లో పాల్గొన్నారు. ర్యాంపు పై నడిపిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
పమేరియన్ పరుగులు, షెపర్డ్ సోకులు -ఈ డాగ్స్ని చూస్తే వామ్మో కాదు వావ్ అనాల్సిందే
పలువురు యజమానులు తమ పెంపుడు జంతువులను అందంగా అలంకరించి ముస్తాబు చేసి పోటీలకు తీసుకువచ్చారు. శునకాలకు తగ్గట్లుగా విభిన్న డిజైన్లలో దుస్తులు ధరింపజేసి, ముస్తాబు చేసి పోటీల్లో పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన కనపరిచిన శునకాలకు ప్రోత్సాహకాలు అందించారు.