ETV Bharat / state

జొన్నరొట్టెలు ఆరోగ్యానికి మంచివి - వాళ్లు రోజూ తినాలంటున్న వైద్యులు - HEALTH WITH JOWAR ROTI

ప్రజలకు ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ - అన్నం మానేసి రాత్రిపూట రొట్టెలు - జొన్నరొట్టెలతో ఆరోగ్యం

Health Benefits with Jowar Roti
Health Benefits with Jowar Roti (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 10:41 PM IST

Health Benefits with Jowar Roti : ఆరోగ్యంపై ప్రజలకు శ్రద్ధ పెరిగింది. ఈ రోజుల్లో చాలామంది రాత్రిపూట అన్నం మానేసి రొట్టెలు తింటున్నారు. ఇందులో ముఖ్యంగా జొన్న రొట్టెలు తినేవారి సంఖ్య పెరుగుతోంది. విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు తదితర పోషక విలువలు జొన్నల్లో సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ జొన్న రొట్టెలు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

జొన్నరొట్టతో ప్రయోజనాలు :

తగ్గనున్న మలబద్ధకం సమస్యలు: జొన్నల్లో ఎక్కువగా ఉండే డైట్‌ ఫైబర్‌ జీర్ణ వ్యవస్థను క్రమబద్ధంగా, సులభంగా ఉంచడానికి తోడ్పడుతుంది. మలబద్దాకానికి సంబంధించిన సమస్యలను తగ్గించి, పేగు సంరక్షణను మెరుగుపరుస్తుంది.

తగిన శక్తి: ప్రోటీన్, కార్బొహైడ్రేడ్లు ఇతర పోషకాలు జొన్నల్లో కలిగి ఉండటం వల్ల శరీరానికి తగిన శక్తి వస్తుంది. ప్రతిరోజూ తినడం వల్ల చురుకుదనం పెరుగుతుంది.

ఆకలి తక్కువ : జొన్నల్లో పీచు (ఫైబర్‌) ఎక్కువగా ఉండటంతో త్వరగా ఆకలి వేయదు. అధిక కొవ్వును తగ్గించి, అనవసరమైన కేలరీలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజూ రాత్రి వేళలో రొట్టెలు తింటే ప్రయోజనం కనిపిస్తుంది.

షుగర్​ కంట్రోల్​ : జొన్నరొట్టెలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది. గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించి మధుమేహం దరికి రాకుండా చేస్తుంది.

పెరగనున్న హిమోగ్లోబిన్‌ : జొన్న రొట్టెలు ఆహారంగా తీసుకోవడం ద్వారా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, విటమిన్‌ బి లాంటివి శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఈ రొట్టెలు రక్తహీనత తగ్గించడంలో తోర్పడుతాయి. అంతేగాక హిమోగ్లోబిన్‌ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గుండెకు మంచిది : జొన్నల తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు. ఇందులో ఉండే ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించి హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గట్టిపడనున్న ఎముకలు : మెగ్నీషియం, కాల్షియం లాంటి ఖనిజాలు ఎముకలు బలంగా ఉండేలా చూస్తాయి. ఎముకలకు సంబంధించిన రోగాలు, సమస్యలు తగ్గించడానికి జొన్నలు మంచి ఆహారం. వృద్ధులు రోజూ తినడం వల్ల ఎముల గట్టిదనం పెరుగుతుంది.

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం : జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా క్యాన్సర్‌ కణాల వృద్ధిని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే పోలీఫినాల్స్‌ అనే పదార్థం శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను నియత్రిస్తుంది. విటమిన్‌ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శరీరంలో వ్యాధి కారకాలను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది.

"జొన్నల్లో అనేక పోషకాలు ఉన్నాయి. దీనివల్ల మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు క్రమం తప్పకుండా తీసుకుంటే మేలు. మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, విటమిన్‌ బి లాంటివి పుష్కలంగా అందుతూ ప్రయోజనం చేకూరుస్తాయి. ఏ వయసు వారైనా జొన్నరొట్టెలు తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది." - డాక్టర్‌ దాసరోజు రమేష్, న్యూరో ఫిజీషియన్, హనుమకొండ

జొన్నరొట్టెల వ్యాపారం : జొన్న రొట్టెలు తినేవారు రోజురోజుకూ పెరుగుతుండటంతో చాలామంది మహిళలు ఈ రొట్టెల తయారీని జీవనోపాధిగా మార్చుకుంటున్నారు. ప్రతి నగరంలోనే రోజుకు వేల రూపాయల వ్యాపారం సాగుతోంది. దీనికి పెట్టుబడి లేకపోవడంతో పేద మహిళలు సైతం రొట్టెల తయారీ వ్యాపారం చేసుకుంటున్నారు. రొట్టెల తయారీ, వ్యాపార కేంద్రాలు వెయ్యికి పైగా ఉన్నాయి. ఒక్కో రొట్టె రూ.15 చొప్పున అమ్ముతున్నారు.

నగరంలోని గిరిజన మహిళలు రొట్టెల తయారీతో ఉపాధి పొందుతున్నారు. గిరిజన తండాలు, గ్రామాల నుంచి వచ్చి నగరంలో జొన్నరొట్టెల వ్యాపారాలు చేసుకుంటున్నారు. జొన్నరొట్టెలకు సాయంత్రం ఎక్కువగా గిరాకీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ 100 నుంచి 200 రొట్టెల వరకు అమ్ముతున్నారు. జొన్న రొట్టెల అమ్మకాలు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జోరుగా ఉంటున్నాయి. రోజూ ఖర్చులు పోనూ రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు సంపాదిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.