Director Vamsi Visited Cinema Tree in Kumaradevam: సినిమా చెట్టుగా పేరొందిన ఈ వృక్షం తిరిగి చిగురించాలని దర్శకుడు వంశీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలోని 150 ఏళ్ల చరిత్ర గల సినిమా చెట్టును వంశీ పరిశీలిచారు. ఈ చెట్టు దగ్గర 18 సినిమాలకు పైగా తీసి హిట్టు కొట్టానని, అలాంటి ఈ చెట్టుతో తీరని అనుబంధం ఉందని వంశీ తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ సినిమా చెట్టు కూలిపోవడం తీవ్ర దురదృష్టకరమని వంశీ వాపోయారు. ఈ చెట్టుతో గ్రామానికి ఎనలేని గుర్తింపు లభించిందని, ఒకప్పుడు కుమారదేవం అంటే ఎవరికి తెలియదని ఇప్పుడు ఆ చెట్టువల్ల అందరూ కుమారదేవం చెట్టు అంటున్నారని వంశీ తెలిపారు.
చెట్టు కూలిపోయిందని నాకు ఎన్నో ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు వచ్చాయని, నా తల్లి చనిపోయినప్పుడు కూడా నాకు అన్ని ఫోన్ కాల్స్ రాలేదని తెలిపారు. ఈ చెట్టుతో తనకు ఉన్న అనుంబంధాన్ని వంశీ గుర్తు చేసుకున్నారు. కూలిన చెట్టుని పునరుద్ధరించాలని కోరారు. మళ్లీ జీవం పోసి కాపాడాలని రాజమహేంద్రవరానికి చెందిన రోటరీ క్లబ్ సభ్యులను వంశీ కోరారు. చెట్టును పరిశీలించిన అనంతరం వంశీ అక్కడ ఫొటోలు దిగారు.
150 ఏళ్ల వయసు - 300 సినిమాలు - నేలకూలిన భారీ వృక్షం - Cinema tree Fallen down
చెట్టు మరల జీవం పోసుకుంటుంది: ఈ సందర్భంగా చెట్టు వద్దకు వచ్చిన రాజమహేంద్రవరం రోటరీ క్లబ్, ఐకాన్స్ సంస్థ అధ్యక్షులు ఇమ్మని వెంకట్ మాట్లాడుతూ ప్రకృతిపై ఉన్న ప్రేమతో తాము అత్యంత వయసు కలిగిన చెట్లను బతికించే ప్రయత్నంగా చేసే ప్రయోగాల్లో 15 చెట్లను పునరుద్ధరించామని అన్నారు. అలాగే కుమారదేవంలో 150 సంవత్సరాలు పైగా వయసు కలిగిన ఈ చెట్టు మరల పునరుద్ధరించేలా కృషి చేస్తామని తెలిపారు. సుమారు 50 రోజుల సమయంలో చెట్టు మరల జీవం పోసుకుంటుందని హామీ ఇచ్చారు.
నేలకూలిన సినీ వృక్షం : ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన ఈ భారీ వృక్షం నేలకొరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున (ఆగస్టు 5న) పడిపోయింది. సుమారు 300 సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఈ చెట్టు వద్దే చిత్రీకరించారు.
అడవిలో అద్భుతం- చెట్టు నుంచి ఉబికి వస్తున్న జలధార - Water From Tree in Alluri District