Diarrhoea Problems in Guntur District : ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కలుషిత నీరు తాగి డయేరియా (Diarrhea victims in Guntur) బారిన పడుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కలుషిత నీరు (Contaminated water) వలన ఒకరు మృతి చెందటంతో పాటు వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ ఘటన నుంచి యంత్రాంగం పాఠాలు నేర్వక పోవటం వలన బాపట్ల మండల పరిధిలోని తూర్పు పిన్నిపోయిన వారి పాలెంలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు పాలైన ఘటన వెలుగు చూసింది.
Diarrhoea Deaths in Andha Pradesh : మూడు రోజుల నుండి డయేరియా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం (Government) వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని బాధిత ప్రజలు వాపోతున్నారు. అధికారుల సహాయం, మాటలు నామమాత్రంగానే ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దాదాపుగా 50 మంది బాధితులు అటు గుంటూరు రమేష్ హాస్పటల్కి కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ, బాపట్ల ఏరియా ఆసుపత్రి లోనూ చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం వైపు నుంచి ఆ గ్రామంలో తాగునీరు విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. గ్రామంలో (Village) దాదాపుగా 8 కుటుంబాలు మొత్తం ఈ డయేరియా బారిన పడటంతో తాళాలు వేసుకొని మరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి శుద్ధమైన నీరు కల్పించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గుంటూరులో ప్రాణాలు తోడేస్తున్న కలుషిత జలం - మొక్కుబడిగా నీటి పరీక్షలు!
Contaminated water in Guntur : గుంటూరు నగరవాసుల గుండెల్లో డయేరియా డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వాంతులు, విరేచనాలతో ప్రజలు ఆసుపత్రుల్లో చేరడం స్థానికుల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. అన్ని చర్యలు చేపట్టామని అధికారులు (Officers) చెబుతున్నా ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే డయేరియా లక్షణాలతో చనిపోయినవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంకా కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.
'గుంటూరు మరణాల'పై వాస్తవాలు ముందుంచండి - న్యాయసేవాధికార సంస్థను ఆదేశించిన హైకోర్టు
గుంటూరులో రోజురోజుకీ పెరుగుతున్న డయేరియా బాధితులు- మృతుల సంఖ్యపెరగడంపై ఆందోళన!