ETV Bharat / state

వజ్రం కావాలా నాయనా? - అదృష్టం ఉంటే మీకు దొరకవచ్చు - Diamonds Hunting in Andhra Pradesh

Diamonds Hunting in Andhra Pradesh: వజ్రాలు ఎంతో విలువైనవి. ఒక్క వజ్రం ఉన్నా వారి జీవితమే మారిపోతుంది. అందుకే కృష్ణా నది తీరాన ఉన్న కొండల్లో వజ్రాల కోసం వేట మొదలైంది. కనీసం బస్సు సౌరక్యం కూడా లేని ప్రాంతంలో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై వచ్చి మరీ అన్వేషిస్తున్నారు. ఈ వజ్రాల వేటకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు.

Diamonds in Gudimetla village
Diamonds in Gudimetla village (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 11:31 AM IST

Updated : Jul 27, 2024, 2:21 PM IST

Diamonds Hunting in Andhra Pradesh: కృష్ణా నది తీరాన కొండల్లో వజ్రాల కోసం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం సమీపంలో కృష్ణానదికి ఇరుపక్కలా గోదావరి ప్రాంతంలో ఎత్తైన కొండలు ఉన్నాయి.

నందిగామ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమెట్ల గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోని ఈ కొండల్లో వజ్రాలు ఉంటాయని ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు అన్వేషిస్తున్నారు. కనీసం ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం లేకపోయినా కూడా కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై వస్తున్నారు. సంవత్సరం పొడవునా సాగే వజ్రాల వేటకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. కొంతమంది అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు, క్యాన్లల్లో తాగడానికి నీరు తీసుకుని వస్తుంటారు.

కొండపై కొంత దూరం వరకే వాహనాలు వెళ్లటానికి వీలుంటుంది. అక్కడి నుంచి కొండపై రాళ్లల్లో, చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్లి కొండ పైభాగానికి చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెతుకులాట మొదలుపెడతారు. కొండపై దట్టంగా ఉన్న చెట్లు, రాళ్ల మధ్యకు వెళ్లి మట్టిని తవ్వి వజ్రాలు కోసం వెతుకుతారు. దీనిలో భాగంగా తమకు కనపడిన రంగురాళ్లను జాగ్రత్త చేసుకుంటారు.

కొండగుట్టల్లో దాగిన అదృష్టం! - జీవితం మారిపోయేందుకు ఒక్క రోజు చాలంట

రంగురాళ్లు కనిపిస్తే వెంటనే వాటిని కడిగి వజ్రమా కాదా అని పరిశీలిస్తారు. ఇలా రోజుల తరబడి, గంటలు తరబడి వెతుకుతూనే ఉంటారు. గతంలో కొందరికి వజ్రాలు దొరికాయనే ప్రచారంతో భారీగా జనం వస్తున్నారు. కొంతమంది అయితే కొండపై ఉన్న చిన్న ఆలయంలోనే తమ మకాం వేస్తున్నారు. అదే విధంగా గుడిమెట్ల పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడు కొందరు రూమ్​లు అద్దెకు తీసుకుని మరీ, వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తుంటారు. దేవుడి దయ ఉండి వజ్రం దొరికి, తమ జాతకం మారుతుందని పేర్కొంటున్నారు. ఇక్కడికి వజ్రాలు కొనే వ్యాపారుల ఏజెంట్లు కొంతమంది వచ్చి పోతుంటారు. ఎవరికైనా వజ్రం దొరికితే వెంటనే వ్యాపారులకు చూపించి నిర్ధారణకు వచ్చి దానిని కొనుగోలు చేస్తుంటారు.

గుంటూరు నుంచి వచ్చిన కుటుంబం: గుడిమెట్ల కొండపై వజ్రాలు దొరుకుతాయని ఓ వ్యక్తి కుటుంబంతో సహా వచ్చాడు. భోజనాలు తీసుకుని వచ్చి వెతుకుతున్నారు. దేవుడి దయ ఉంటే దొరుకుతాయని, ఒక్క వజ్రం దొరికినా జీవితం మారిపోతుందని గుంటూరు నుంచి వచ్చిన షేక్‌ బాజీ అంటున్నారు.

రంగురాళ్లు కనిపిస్తున్నాయి: ఉదయాన్నే బైక్‌పై వచ్చి కొండపైకి వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నానని ఖమ్మం జిల్లా చొప్పకట్లపాలెంకు చెెందిన గరపాకుల సాంబయ్య అంటున్నారు. రంగురాళ్లు కనిపిస్తున్నాయని, తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నానన్నారు.

వర్షాకాలం వచ్చింది- వజ్రకరూరులో వజ్రాల వేట మొదలైంది! - Villagers Search of Diamonds

Last Updated : Jul 27, 2024, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.