DGP Dwaraka Tirumala Rao Awareness on Drugs: యువత సమాజంలో కీలకపాత్ర పోషిస్తారని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం జరుగుతోందని తెలిపారు. విజయవాడ లయోల కళాశాలలో డ్రగ్స్ నియంత్రణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కళాశాల సిబ్బంది డీజీపీని సన్మానించారు. ఈ క్రమంలో డీజీపీ మాట్లాడుతూ పాఠశాల విద్యార్ధులకు సైతం మత్తుపదార్ధాలు లభిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కొందరు తమ స్వార్ధం కోసం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
మత్తు పదార్ధాలు విక్రయిస్తున్న కీలక వ్యక్తులను అరెస్ట్ చేస్తామని అన్నారు. గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా విశాఖ ఏజెన్సీ నుంచి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. గంజాయికి బానిసైన వ్యక్తులు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు. మత్తులో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నామనే ఆలోచన కూడా ఉండదని అన్నారు. ఖచ్చితంగా మత్తు పదార్ధాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడతామని యువత వీటికి బానిసలు కాకుండా ఉండాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు కోరారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం అధికంగా జరుగుతోందని. పాఠశాల విద్యార్ధులకు సైతం మత్తుపదార్ధాలు లభిస్తున్నాయి. యువత సమాజంలో కీలకపాత్ర పోషిస్తారు అలాంటి యువత మత్తుకు బానిసలు అవుతున్నారు. కొందరు తమ స్వార్ధం కోసం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాము. గంజాయి సాగు ఎక్కడైతే ఉందో వాటిని ధ్వంసం చేసేందుకు చర్యలు చేపడుతున్నాము. దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా విశాఖ ఏజెన్సీ నుంచి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇకపై అలాంటి ఆరోపణలు రాకుండా చూస్తాం. ఖచ్చితంగా మత్తు పదార్ధాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడతున్నాము. యువత మాత్రం మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా ఉండాలి.- ద్వారకా తిరుమలరావు, డీజీపీ
ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల చేసేవారిపై కఠిన చర్యలు: డీజీపీ ద్వారకా తిరుమలరావు - DGP Orders to SP