ETV Bharat / state

అచ్యుతాపురం ప్రమాదం బాధాకరం - 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ: పవన్‌కల్యాణ్‌ - Pawan Kalyan reacts on Blast

Pawan Kalyan Reacts on Atchutapuram Blast Incident : అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. కేవలం సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ మెుదలు పెడతామని స్పష్టం చేశారు.

Pawan Kalyan Reacts on Atchutapuram Blast Incident
Pawan Kalyan Reacts on Atchutapuram Blast Incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 11:36 AM IST

Pawan Kalyan Reacts on Atchutapuram Blast Incident : అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్​ మాట్లాడుతూ "కాలుష్య నియంత్రణ నా పరిధిలో ఉంది, భద్రత వేరే శాఖలోకి వస్తుంది. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పాను. పరిశ్రమలు మూతపడతాయనే భయం కూడా ఉంది. ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలి. సెప్టెంబర్‌లో విశాఖ వెళ్లి పరిశ్రమల్లో భద్రత చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తా. ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరం. సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు. రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ మెుదలు పెడతా" అని వెల్లడించారు.

పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు - కార్మికులను వెంటాడుతున్న ప్రాణభయం - industrial accidents in Visakha

ప్రభుత్వం అండగా ఉంటుంది : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరమని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. 17మంది దుర్మరణం చెందడం తీవ్రంగా కలచివేస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను కూడా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందిని స్పష్టం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యంపై ఇప్పటికే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

చివరి బాధితుడి వరకు న్యాయం : అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. చివరి బాధితుడి వరకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కంపెనీ నుండి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని ప్రభుత్వం నుండి కూడా సహకారం అందిస్తామని తెలిపారు. ప్రతి బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నేడు బాధితులందరినీ పరామర్శిస్తారని తెలిపారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అచ్యుతాపురం సెజ్​ ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్‌ - 17 మంది మృతి - Reactor Blast in Pharma Company

అచ్యుతాపురం ఫార్మా ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఆదేశం - బాధిత కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.