Woman Missing Case: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ఓ యువతి మిస్సింగ్ మిస్టరీ వీడింది. గతేడాది అక్టోబరులో అదృశ్యమైన యువతి జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ యువతిని అక్కడి నుంచి విజయవాడకు పోలీసు ప్రత్యేక బృందం తీసుకువస్తోంది.
Pawan Reaction on Woman Missing Case: యువతి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించటం పట్ల పవన్ స్పందించారు. ఆదేశించిన 48 గంటల్లో యువతి ఆచూకీ కనిపెట్టటంపై పోలీసులు అధికారులను అభినందించారు. అలాగే రాష్ట్రంలో మరో 30వేల మంది యువతులు అదృశ్యమయ్యారని, వారి ఆచూకీ కూడా కనిపెట్టాలన్నారు. యువతుల మిస్సింగ్‌పై గత ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని, దీనిపై ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తామన్నారు.
రేపు సాయంత్రం దిల్లీకి సీఎం చంద్రబాబు- బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చలు!
ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుటి నుంచి సమావేశాలు, సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న పవన్ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో భీమవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె కనిపించటం లేదని పవన్ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ సీఐతో ఫోన్లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఆ మహిళకు న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి ఆదేశించిన 48 గంటల్లోనే పోలీసులు యువతి అదృశ్యం కేసును ఛేదించారు.
"ఇటీవల తన కూతురు కిడ్నాప్‌నకు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూకశ్మీర్‌లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. 9 నెలల క్రితం మిస్సైన యువతి కేసును 48 గంటల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాననంటే ప్రభుత్వం తలచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే. గత ఐదేళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యంపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉంది." - పవన్ కల్యాణ్, ఉపముఖ్యమంత్రి