ETV Bharat / state

రహదారుల నిర్మాణానికి కేంద్ర సాయం మరింత కోరుదాం: డిప్యూటీ సీఎం పవన్​ - Pawan Kalyan on Rural Roads - PAWAN KALYAN ON RURAL ROADS

Deputy CM Pawan Kalyan on Rural Roads: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రహదారుల నిర్మాణాలపై ఉపముఖ్యమంత్రి పవన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు కార్యరూపం ఇవ్వాలన్న ఆయన పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశించారు.

Deputy_CM_Pawan_Kalyan_on_Rural_Roads
Deputy_CM_Pawan_Kalyan_on_Rural_Roads (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 7:29 AM IST

Deputy CM Pawan Kalyan on Rural Roads: రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు కార్యరూపం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరుదామని చెప్పారు.

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏ.ఐ.ఐ.బి.) అధికారులతో ఉపముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. 250 మందికి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణం సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. నెలకు రూ.200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో పురోగతి ఉంటుందని తెలిపారు.

పట్టాలెక్కుతున్న పురోగతి- ఎన్డీయే ప్రభుత్వంతో రహదారులకు మోక్షం - Widening of National Highway 44

రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.75 కోట్ల మ్యాచింగ్ గ్రాంటు సమకూరిస్తే బ్యాంకు రూ.125 కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుబడిందని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవనీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యత మేం తీసుకుంటామన్నారు.

పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలనీ ఆదేశించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్​లో ప్రత్యేక కాలమ్ పొందుపర్చాలన్నారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30 శాతం మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరతామనీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

అమరావతి మహానగరికి ఓఆర్​ఆర్​ హారం- రాష్ట్రంలో ఇక భూములు బంగారం - Amravati Ring Road Project

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.