ETV Bharat / state

గుర్లలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన - మృతుల కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం - PAWAN KALYAN VISIT GURLA

ఘటనపై నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్న పవన్‌ - విచారణకు సీనియర్‌ ఐఏఎస్‌ విజయానంద్‌ నియామకం

Pawan_Kalyan_visit_Gurla
Pawan Kalyan Visit Gurla (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 3:24 PM IST

Pawan Kalyan Visit Gurla : విజయనగరం జిల్లాలో గుర్లలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​ పర్యటించారు. నెల్లిమర్ల మండలం ఎస్.ఎస్.ఆర్.పేట వద్ద గుర్ల తాగునీటి పథకాన్ని పరిశీలించారు. అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియా బాధితులను పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. గుర్లలో గ్రామస్థులతో డిప్యూటీ సీఎం పవన్‌ ముఖాముఖి నిర్వహించారు.

మృతుల కుటుంబాలకు వ్యక్తిగత పరిహారం: గ్రామస్థులు 3 ప్రధాన సమస్యలను పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి ట్యాంకులు ఎక్కువ రోజులు శుభ్రపరచడంలేదని, ఒకే ఒక్క ట్యాంకు వల్ల తాగునీటి సమస్య తలెత్తుతోందని గ్రామస్థులు ఆరోపించారు. సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు వినతి పత్రాలు అందజేశారు. అదే విధంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షను నిర్వహించారు. అతిసారం వ్యాప్తి, కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తన తరఫున మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

విచారణకు సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్ విజయానంద్‌: ఘటనపై నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని పవన్‌ భరోసానిచ్చారు. గత ప్రభుత్వ తప్పిదాలు వారసత్వంగా వచ్చాయని, గుర్లకు వెళ్లే చంపావతి నీరే కలుషితమైందని అన్నారు. గత ప్రభుత్వం కనీసం మంచినీరు అందించలేకపోయిందన్న పవన్, విచారణకు సీనియర్‌ ఐఏఎస్‌ విజయానంద్‌ను నియమించారు. విచారణ తర్వాత ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటిస్తామని పవన్ కల్యాణ్​ తెలిపారు.

సంక్రాంతికి 'పల్లె' కళకళలాడాలి - చంద్రబాబు అనుభవం మాకు ఎంతో బలం: పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.