ETV Bharat / state

కోర్టు ఆదేశాలతోనే వైఎస్సార్​సీపీ ఆఫీస్ కూల్చివేత- సీఆర్డీఏ - Demolition of YSRCP office - DEMOLITION OF YSRCP OFFICE

Demolition of Building Illegally Constructed for YSRCP Office: గుంటూరు జిల్లాలోని వైఎస్సార్​సీపీ కార్యాలయం కూల్చివేత కోర్టు ఆదేశాల ప్రకారమే జరిగిందని అధికారులు ప్రకటించారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న ఈ స్థలాన్ని తక్కువ లీజుతో వైఎస్సార్​సీపీకార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్‌ కట్టబెట్టింది. అనుమతులు లేకుండానే ఈ భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తించాక వైఎస్సార్​సీపీకి నోటీసులు జారీ చేసి కూల్చివేసినట్లు సీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.

demolition_of_ysrcp_office
demolition_of_ysrcp_office (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 9:05 PM IST

Updated : Jun 22, 2024, 10:17 PM IST

Demolition of Building Illegally Constructed for YSRCP Office: గుంటూరు జిల్లా సీతానగరంలో నీటిపారుదల శాఖ స్థలంలో అనుమతులు లేకుండా చేపట్టిన వైఎస్సార్​సీపీ కార్యాలయ భవనాన్ని సీఆర్డీఏ, ఎంటీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో ఇరిగేషన్ బోట్ యార్డు స్థలముంది. దీనిలో 2 ఎకరాల భూమిని వైఎస్సార్​సీపీ హయాంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింAది. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లే దారిలో బకింగ్ హామ్ మెయిన్ కెనాల్ పక్కనున్న స్థలాన్ని తక్కువ ధరకే వైఎస్సార్​సీపీ కొట్టేసింది.

ఈ ప్రాంతంలో ఎకరా మార్కెట్ ధర 5 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. కానీ ఏడాదికి ఎకరాకు కేవలం వెయ్యి చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గతేడాది ఫిబ్రవరి 16న వైఎస్సార్​సీపీ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ జీవో బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు జీవో బయటికి రావడంతో స్థానికులు అప్పటి ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

మనకెందుకు అనుమతులు అనుకున్నారేమో- అక్రమనిర్మాణాలపై వైఎస్సార్​సీపీకి నోటీసులు - GVMC Notices to YSRCP Office

అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి: తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ కట్టిన అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో బోట్‌ యార్డ్‌ సమీపంలో వైఎస్సార్​సీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణంపై అనుమతులు చూపించాలంటూ నోటీసులు జారీ చేశారు. వీటిపై వైఎస్సార్​సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా వారికి ఊరట లభించలేదు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల సాయంలో తెల్లవారుజాము నుంచే కూల్చివేత చేపట్టిన అధికారులు రెండున్నర గంటల్లోనే ప్రక్రియ పూర్తిచేశారు.

వైఎస్సార్​సీపీ కార్యాలయ అక్రమ నిర్మాణాన్ని న్యాయస్థానం ఆదేశాలమేరకే కూల్చివేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టకపోతే కోర్టు నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. జలవనరుల శాఖ భూమిని వైఎస్సార్​సీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వడం కుదరదంటూ ఈఎన్సీ నారాయణరెడ్డి ఇచ్చిన లేఖను ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.

నారా లోకేశ్​ ప్రజాదర్బార్​కు అనూహ్య స్పందన - రాష్ట్రవ్యాప్తంగా సమస్యలతో వస్తున్న ప్రజలు - Nara Lokesh Prajadarbar

వైఎస్సార్సీపీ సర్కార్​లో ఉత్సవ విగ్రహాల్లా సర్పంచ్‌లు - మంత్రి పవన్ కల్యాణ్​పై కొత్త ఆశలు - YSRCP Govt Careless on Panchayats

Last Updated : Jun 22, 2024, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.