ETV Bharat / state

బురదలో ఇరుక్కుపోయిన అంబులెన్స్​ - గర్భిణీ అవస్థలు - డోలీలో తరలింపు - Delivery Woman Carried in Doli

Delivery Woman Facing Problem in Paderu : ఆడవారికి పురిటినొప్పులు పునర్జన్మతో సమానమంటారు. తన ప్రతి రూపానికి ప్రాణం పోసేందుకు వారు తన ప్రాణాన్ని సైతం పణంగా పెడతారు. కానీ అలాంటి పురిటి నొప్పులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటారు నిండు గర్భిణులు. కానీ ఏజెన్సీ గ్రామాల్లో నివసించే మహిళలకు మాత్రం ప్రసవానికి ముందు ఎదురయ్యే కష్టాలు మాత్రం దినదిన గండంగా మారుతున్నాయి. మన్యంలో తాజాగా ఓ మహిళ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. చివరకు 108 సిబ్బంది సకాలంలో స్పందించడంతో సురక్షితంగా ప్రసవం జరిగింది.

Delivery Woman Carried in Doli
Delivery Woman Carried in Doli (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 11:47 AM IST

Delivery Woman Carried in Doli at Paderu : శాస్త్రసాంకేతిక రంగలో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. కానీ దేశంలోని చాలా ప్రాంతాలకు ఇప్పటికి సరైన రోడ్డు సౌకర్యాలు లేవు. ఇక కొండకోనల్లో ఉండే గిరిజనుల పరిస్థితి మరీ దయనీయమని చెప్పవచ్చు. అక్కడ ఎవరైనా ఆనారోగ్యానికి గురయ్యారంటే వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లాలంటే డోలీలే దిక్కు. ఇక గర్భిణులకు కడుపున బిడ్డ పడినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు వారికి దినదిన గండమే. ఎప్పుడే ఇబ్బంది వచ్చినా వైద్యం కోసం సాహసం చేయక తప్పని స్థితి. డోలీ కట్టి కిలోమీటర్ల మేర తీసుకుళ్తే గానీ ఆసుపత్రికి చేరుకోలేని దయనీయ స్థితి వారిది. దీంతో ప్రసవ సమయంలో సకాలంలో వైద్యం అందక ఎంతో మంది గిరిజన బిడ్డలు నరకయాతన అనుభవిస్తున్నారు.

Pregnant woman Problem in Paderu : మన్యంలో డోలీమోతలు ఆగడం లేదు. దీంతో గిరి పల్లెల్లోని ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరాలంటే ఇవే దిక్కుగా మారాయి. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దీంతో బాధితులు ఆసుపత్రికి చేరడం గగనంగా మారింది.తాజాగా ఓ గర్భిణి నరకయాతన అనుభవించి ఇంటి వద్దే కవలలకు జన్మనిచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మారుమూల కించూరు పంచాయతీ గడ్డిబంధలుకు చెందిన కిల్లు అచ్చెమ్మ నిండు గర్భిణి. ఆమెకు బుధవారం ఉదయం 11 గంటలకు పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు.

Agency People Problems in Alluri Sitaramaraju Dist : దీనిపై సమాచారం అందుకున్న ఈఎంటీ రామకృష్ణ, పైలట్‌ సతీశ్‌ అంబులెన్స్‌తో గ్రామానికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలో మత్స్యగెడ్డ వంతెన వద్ద వాహనం బురదలో కూరుకుపోయింది. దాన్ని బయటకు తీసి గ్రామానికి వెళ్లేసరికే గర్భిణి చిట్టెమ్మ ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. మరో బిడ్డ కడుపులో అడ్డం తిరగడంతో నొప్పులతో యాతన అనుభవించింది. అక్కడ వాహనం ఇంటి వరకు చేరే మార్గం లేదు.

దీంతో కొంతదూరంలోనే వాహనాన్ని ఆపేసిన 108 సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ప్రసవం చేశారు. మరోవైపు సమయానికి అంబులెన్స్ సిబ్బంది వచ్చి సురక్షితంగా ప్రసవం చేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత డోలీలో శిశువులు, తల్లిని మోసుకొచ్చి అంబులెన్స్​లోకి ఎక్కించారు. వారిని అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వర్షం కురుస్తున్న కానీ సకాలంలో స్పందించి వారిని కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. మహిళ కుటుంబ సభ్యులు కూడా వారికి ధన్యవాదాలు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

గర్భిణీకి అనారోగ్యం.. రోడ్డులేక డోలీలోనే ఆస్పత్రికి.. నదిని దాటుతూ గ్రామస్థుల అవస్థలు

Tribals Carried Sick Woman in Doli at Charlapalli: ఇంకెన్నాళ్లు ఈ మోతలు.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆగని మరణ మృదంగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.