Jani Master Wife Sensational Comments on Her Husband Arrest Issue : తన భర్త, జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాల్లేకుండా ఆయనెందుకు చేస్తారని సుమలత అలియాస్ ఆయేషా పేర్కొన్నారు. ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె నిజం నిరూపిస్తే భర్తను వదిలేస్తానని ఓ ఛానల్‌తో ఆయేషా అన్నారు.
‘‘కొరియోగ్రాఫర్‌గా అగ్ర స్థానంలో ఉండాలి లేదా హీరోయిన్‌గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి, ఆమె తల్లి కోరిక. స్టేజ్ షోల నుంచి వచ్చిన ఆమె సినీ రంగాన్ని చూసి ఆ లగ్జరీ లైఫ్ కావాలని కోరుకునేది. తనకెక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని చూస్తుంటుంది. మైనర్‌గా ఉన్నప్పుడు ఘటన జరిగిందనడానికి సాక్ష్యమేంటి? జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా? ఇప్పటి వరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా? అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైంది? ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే ‘జానీ మాస్టర్ వద్ద పని చేయడం నా అదృష్టం’ అని నవ్వుతూ ఎందుకు చెబుతుంది. ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. హైదరాబాద్‌లో అసోషియేషన్ కార్డు పొందేందుకు ఆమె దగ్గర డబ్బులేకపోతే మాస్టర్ ముంబయిలో ఇప్పించారు. తాను పని చేసిన సినిమాలో కొరియోగ్రాఫర్‌గా అవకాశం కూడా ఇచ్చారు’’ అని అన్నారు.
అత్యాచారం కేసులో అరెస్టయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు నేడు ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబరు 3 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. అనంతరం పోలీసులు జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జానీమాస్టర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనపై 2019లో అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. యువతి ఫిర్యాదు ఆధారంగా తొలుత అత్యాచారం, నేరపూరిత బెదిరింపు, దాడి తదితర మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిపై అఘాయిత్యం జరిగినప్పుడు మైనర్ అని తేలడంతో పోక్సో చట్టం చేర్చారు.