Damaged Roads in Prathipadu Constituency: కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రహదారులు వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. కత్తిపూడి నుంచి రౌతులపూడి వెళ్లే 20 కిలోమీటర్ల రహదారి తీవ్రంగా దెబ్బతింది. ఆర్ అండ్ బీ రహదారిపై గుంతలు దర్శనమిస్తున్నాయి. కంకర రాళ్లు తేలి ప్రయాణానికి ప్రతికూలంగా మారాయి.
ఈ రహదారిపై నిత్యం క్వారీ లారీలు భారీ సంఖ్యలో ప్రయాణిస్తుంటాయి. అసలే దెబ్బతిన్న ఈ రోడ్డుపై క్వారీ లారీలు దూసుకెళ్తుండటంతో దుమ్ము, ధూళితో వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. రౌతులపూడి, శంఖవరం మండలాల్లోని వివిధ గ్రామాల ప్రజలు నిత్యం కత్తిపూడి మీదుగా కాకినాడ వెళ్లేందుకు ఇదే మార్గం. తీవ్రంగా దెబ్బతిన్న ఈ రోడ్డుపై ప్రయాణం నరకంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధ్వానంగా ఏలూరు - కైకలూరు ప్రధాన రహదారి
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతాలను కలిపే శంఖవరం-పెద్దమల్లాపురం-వేలంగి ప్రధాన రహదారి దుస్థితి మరింత దయనీయంగా మారింది. 22 కిలోమీటర్ల ఈ దారి దశాబ్ద కాలంగా తీవ్రంగా దెబ్బతింది. అత్యధిక సంఖ్యలో గిరిజనులు, రైతులు వ్యవసాయ ఉత్పత్తుల్ని శంఖవరం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాలకు చేరవేయాలంటే ఈ రోడ్డుపైనే ప్రయాణించాలి.
అడుగుకో గొయ్యితో కంకర రాళ్లు తేలిపోయిన ఈ మార్గంలో ప్రయాణం ప్రసహనంగా మారింది. గిరిజనులు ఆసుపత్రులు, మండల కార్యాలయాలతో పాటు జిల్లా కేంద్ర కాకినాడకు వివిధ పనులపై రాకపోకలు సాగించేంది ఈ రోడ్డుపైనే. రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో వాహనదారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.
అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏళేశ్వరం-జె.అన్నవరం, ఉత్తర కంచి-పెద్దిపాలం, చిన్నింపేట-చినశంకర్లపూడి, ఎం.చామవరం-పి.చామవరం-ఎరుపాక, లచ్చిరెడ్డిపాలెం-ఎన్వీనగరం తదితర రహాదారులు తీవ్రంగా దెబ్బతిని రాకపోకలకు ఏ మాత్రం అనుకూలంగా లేవు. తక్షణమే రహదారులు బాగుచేసి ప్రయాణం సాఫీగా సాగేలా చర్యలు తీసుకుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రహదారుల ప్రాజెక్టును గాలికొదిలేసిన సర్కారు - రుణాలు ఆపేస్తామని కేంద్రం, ఎన్డీబీ హెచ్చరిక
"రోడ్లు దారుణంగా ఉంటున్నాయి. మళ్లీ సింగిల్ రోడ్లు వలన ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు పెద్ద పెద్ద టిప్పర్లు తిరుగుతున్నాయి. వీటి వలన సైతం రోడ్లు పాడవుతున్నాయి. అయితే టిప్పర్లు తిరగక ముందు కూడా గుంతలు పెద్దవి ఉండేవి. ప్రమాదాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి. బస్సు సర్వీసు కూడా లేదు. ప్రమాదాలు అయినప్పుడు రోడ్డు బాగాలేక పోవడం వలన అంబులెన్స్ కూడా రావడం లేదు". - స్థానికుడు
"ఆరు నెలల క్రితం ఆటోకి రెండు టైర్లు కొన్నాను సర్. అప్పుడే పాడయిపోయాయి. నేను ఈ ఆటో కొని సంవత్సరం మాత్రమే ఉయింది. కానీ ఇది ప్రస్తుతం కొత్త ఆటోలా లేదు. అయిదు వేల రూపాయలు వస్తుంటే, పది వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది". - స్థానిక ఆటో డ్రైవర్
వంద అడుగుల కల్వర్టు కట్టలేని సీఎం పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తారు : జనసేన