ETV Bharat / state

మీకూ ఇలాంటి ​కాల్ వచ్చిందా? - ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం!

పెరిగిపోతున్న సైబర్ నేరాలు - అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు

Rising Cyber ​​Fraud Cases
Rising Cyber ​​Fraud Cases (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Rising Cyber ​​Fraud Cases : జనం అత్యాశ, భయం ఈ రెండే సైబర్‌ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. భయపడేవాళ్లలో ఎక్కువగా విద్యావంతులు, ఉన్నతవర్గాలవారు ఉంటున్నారు. ఇలాంటి నమ్మాల్సిన పనిలేదంటున్నారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్​ ఏసీపీ ఆర్‌.జి.శివమారుతి.

మానసికంగా దెబ్బతీసి : అగంతకులు ఫోన్‌ చేసి ఫలానా అబ్బాయి/ అమ్మాయి మీ పిల్లలేనా? వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పగలరా? అని ప్రశ్నిస్తున్నారు. పిల్లల పేర్లు, చెప్పి మానసికంగా ఆందోళనకు గురి చేస్తారు. వాళ్లని కిడ్నాప్‌ చేశాం. మా దగ్గరే ఉన్నారంటూ ఏడుస్తున్న శబ్దాన్ని వినిపిస్తారు. డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారు.

పార్శిల్‌ మోసాలు : ఫెడెక్స్‌ కొరియర్‌ పేరిట ఫోన్‌ చేసి ‘మీ ఆధార్, పాన్‌ నంబరుతో బుక్‌ అయిన పార్సిల్​లో నిషేధిత వస్తువులున్నాయి. దిల్లీ/ముంబయి పోలీసులు, కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్‌ కేసులో మీరు దోషులుగా ఉన్నారు. అంటూ భయాందోళనకు గురిచేస్తారు. ఆతర్వాత స్కైప్‌ వీడియో కాల్‌ చేస్తారు. ఈ క్రమంలోనే పోలీసు యూనిఫారంలో ఉన్న ఉన్న వ్యక్తి వచ్చి కేసు దర్యాప్తు, విచారణ అంటూ హడావుడి చేస్తాడు.

ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నిబంధన పెడతారు. చెబితే వారినీ అరెస్ట్ చేస్తాం అంటారు. గదిలోంచి బయటకు వచ్చినా, ఫోన్‌ కట్‌ చేసినా ఇంటి బయటే ఉన్న పోలీసులు వెంటనే మిమ్మల్ని, కుటుంబ సభ్యులనూ అరెస్ట్ చేస్తారంటూ హెచ్చరిస్తారు. ఎఫ్‌ఐఆర్‌తో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు వారెంట్లు అంటూ పత్రాలను చూపిస్తారు. ఆన్‌లైన్‌లోనే అరెస్ట్ చేస్తామంటారు. కేసు పోవాలంటే మూడో వంతు డబ్బు ఆర్‌బీఐ ఖాతాలో జమ చేయాలని హుకుం జారీ చేస్తారు. 24 గంటల్లో ఆ డబ్బు తిరిగి వస్తాయంటారు. ఈ బెదిరింపులకు లొంగిపోతే మన ఖాతాలు ఖాళీ అయినట్లే.

అంతా సెట్టింగే : స్కైప్‌ వీడియో కాల్‌లో కనిపించే పోలీసుల వెనుక మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించి లోగోలు కనిపిస్తాయి. ఇందంతా సైబర్‌ నేరస్థులు ఏర్పాటు చేసుకున్న సెట్టింగ్‌. ఇలాంటి కాల్స్‌ వస్తే వెంటనే ఫోన్‌ కట్‌ చేసి నంబర్​ బ్లాక్‌ చేయాలి. 1930 నంబర్​కి లేదా www.cybercrime.gov.in లో మోసగాళ్ల ఫోన్‌ నంబర్​లతో ఫిర్యాదు చేస్తే వాటిని వెంటనే బ్లాక్‌ చేస్తారు.

ఆశపెట్టి : ఆన్‌లైన్‌లో హోటళ్లకు రేటింగ్‌లు, పంపించిన వీడియోలకు లైక్‌లు, సమీక్షలు రాయడం, ట్రేడింగ్‌లో లాభాలు అంటూ ఆశపెట్టి దోచేస్తుంటారు కొందరు. ట్రేడింగ్‌లో శిక్షణ ఇస్తామని చెప్పి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్​ల్లో సభ్యత్వం చేర్చుకుంటారు. అక్కడ జరిగే చర్చను చూసి అధిక లాభాలు వస్తాయని చాలా మంది పెట్టుబడులు పెడతారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహిస్తారు. ప్రధానంగా టెలిగ్రామ్, ఇతర సోషల్ మీడియాల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు, షేర్‌ మార్కెట్‌లో 200, 300 శాతం లాభాలంటే అంటే మోసమనే గ్రహించాలి.

బిల్లులు - కేవైసీలు : కరెంట్‌ బిల్లు కట్టాలని, అలాగే డెబిట్​, క్రెడిట్​, బాంక్‌ ఖాతాలను కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని లేదంటే మీ సేవలు నిలిచిపోతాయంటూ మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారు. వారు పంపించే ఏపీకే ఫైల్స్‌ (లింక్‌)పై క్లిక్‌ చేయవద్దు. ఇటీవల జాతీయ బ్యాంకుల లోగోలతో లింక్‌ పంపించి బురిడీ కొట్టిస్తున్నారు. దానిపై క్లిక్‌ చేయవద్దు.

ఇవి గమనించాలి : వాస్తవానికి పోలీసులకు ఫలానా చోట నిందితుడు ఉన్నాడని సమాచారం అందితే ఒకటి రెండుసార్లు నిర్ధారించుకున్న తరువాత మాటు వేసి పట్టుకుంటారు. అంతేగానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని వీడియో కాల్‌ చేసి చెప్పరు. డిజిటల్‌ అరెస్టు అనేది ఏమీ ఉండదు.

ఆన్​లైన్​​ నేరాలకు చెక్​ పెట్టేలా ప్రభుత్వం వ్యూహాలు - ఇకపై జిల్లాకో సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ - Cyber ​​Crime Police Station in AP

సైబర్​ క్రైం బారిన పడ్డారా? - ఆలస్యం చేస్తే మొదటికే మోసం - పోలీసులు ఏం చెప్తున్నారంటే! - CYBER CRIMES rcoverie percentage

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.