ETV Bharat / state

విద్యుత్ అధికారులతో సీఎస్ భేటీ - సమస్యలపై ఫిర్యాదుకు 1912 టోల్ ఫ్రీ నెంబరు - CS Jawahar Reddy - CS JAWAHAR REDDY

CS Jawahar Reddy meeting with Energy Department officials: విద్యుత్ అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి నేపథ్యంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ఇతర ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నెంబరును వినియోగించుకోవాల్సిందిగా సీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

CS Jawahar Reddy meeting with Energy Department officials

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 10:35 PM IST

CS Jawahar Reddy meeting with Energy Department officials: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరిపాలన బాధ్యత అంతా సీఎస్ జవహర్ రెడ్డి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెున్న నీటి సమస్యపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎస్, తాజాగా విద్యుత్ సమస్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు నెలకొంటున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, అధికారులతో సీఎస్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలి: వేసవిలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ఇంధనశాఖ అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ సరఫరా (Power supply) పరిస్థితులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవితో పాటు విద్యార్ధులకు పరీక్షల దృష్ట్యా విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలపై కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులపై నిర్దిష్ట కాలవ్యవధిలోగా చర్యలు తీసుకోవాల్సిందిగా జవహర్ రెడ్డి సూచించారు.

LIVE: ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం

ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నెంబరు: వ్యవసాయానికి కూడా 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల వారీగా లోడ్ మానిటరింగ్ సెల్ ద్వారా నిరంతరం సరఫరా ను పర్యవేక్షించాల్సిందిగా సూచనలు ఇచ్చారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రసారమాధ్యమాల్లో వచ్చే కథనాలపై మూడు విద్యుత్ పంపిణీ సంస్థల వారీగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాల్సిందిగా జవహర్ రెడ్డి (CS Jawahar Reddy ) సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ఇతర ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నెంబరును వినియోగించుకోవాల్సిందిగా సీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సంబంధిత ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పంపిణీ సంస్థల వారీగా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల వారీగా విద్యుత్ సరఫరాకు సంబంధించి నిత్యం 9 రకాల ఫార్మాట్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఇంధన శాఖ అధికారులు సీఎస్​ జవహర్ రెడ్డి వివరించారు.

తాగునీటి సమస్య లేకుండా చూడాలి - అధికారులను ఆదేశించిన సీఎస్ - water crisis in andhra pradesh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.