ETV Bharat / state

ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్ - రూ. 43లక్షల సొమ్ము స్వాధీనం - Cricket betting gang arrest - CRICKET BETTING GANG ARREST

Cricket Betting Gang Arrest : హైదరాబాద్​లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను, పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్ మాతృశ్రీనగర్ కాలనీ భవనంలో క్రికెట్ బెట్టింగ్​ నిర్వహిస్తున్న నలుగురిని, సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.43.57 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

IPL BETTING GANG ARREST IN HYD
Cricket Betting Gang Arrest
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 3:50 PM IST

Updated : Apr 10, 2024, 4:21 PM IST

Cricket Betting Gang Arrest : ప్రస్తుతం ఐపీఎల్(IPL 2024) క్రికెట్ టోర్నీ జరుగుతున్న వేళ, దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఈనేపథ్యంలో మూడో కంటికి తెలియకుండా బెట్టింగ్ రాయుళ్ల దందా జోరుగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్​లో ఐపీఎల్ ఆన్‌లైన్‌ క్రికెట్ బెట్టింగ్(Cricket Betting) నిర్వహిస్తున్న ముఠాపై సైబరాబాద్‌ ఎస్​వోటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని, మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.

ఆన్​లైన్ బెట్టింగ్​లకు బానిసైన మిషన్ భగీరథ ఏఈ - వర్క్ ఆర్డర్ల పేరుతో రూ.8 కోట్లు స్వాహా

IPL Betting Gang Arrest : ప్రధాన నిందితుడు పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన శాకమూరి వెంకటేశ్వర్‌ రావు అలియాస్‌ (చిన్నూ) ఆధ్వర్యంలో బెట్టింగ్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ప్రధాన నిందితుడు చిన్నూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడుల సమయంలో 43 లక్షల 57వేల 461 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

పోలీసుల అదుపులో ఉన్నవారిలో ఆలూరు త్రినాథ్ S/o శివ రామయ్య (గుంటూరు), వయస్సు 34, ల్యాప్‌టాప్ ఆపరేటర్​గా చేస్తున్నాడు. ఇతను గతంలో హయత్‌నగర్ పోలీస్​ స్టేషన్, రాచకొండలో అరెస్టు చేశారు. గత రెండు సమవత్సరాలుగా ప్రధాన బుకీగా చేస్తున్నాడు. మనం రాజేష్ S/o బ్రహ్మానందం(గుంటూరు), వయస్సు 33, ల్యాప్‌టాప్ ఆపరేటర్​గా చేస్తున్నాడు. బొల్లె స్వామి S/o రమేష్(గుంటూరు), వయస్సు.30, లైన్ రీడింగ్​గా పనిచేస్తున్నాడు. మార్పెన్న గణపతిరావు S/o అప్పల నాయుడు(విజయనగరం జిల్లా), వయస్సు 57గా గుర్తించినట్లు తెలిపారు.

నిందితుల నుంచి 08 స్మార్ట్‌ఫోన్లు, 02 కీపాడ్‌ ఫోన్లు, 03 ల్యాప్‌టాప్‌లు, 03 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌ కోసం ఉపయోగిస్తున్న అయిదు ఖాతాల్లోని 3లక్షల 57 వేల 461 రూపాయలను ఫ్రీజ్‌ చేసినట్లుగా తెలిపారు. సీజ్‌ చేసిన వాటి మొత్తం విలువ 52లక్షల 59 వేల 641 రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. బెట్టింగ్(Online Betting) అంతా కూడా క్రికెట్ లైవ్ గురు, లక్కీ ఆన్‌లైన్ యాప్, కాల్ కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 50 వరకు పంటర్స్ ఆన్​లైన్​ బెట్టింగ్​లో పాల్గొన్నట్లు గుర్తించారు. కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అప్పుడు రష్మిక, ఇప్పుడు సచిన్- డీప్​ఫేక్​తో బెట్టింగ్ మోసం!

ఫైనాన్స్ ఏజెంట్ల నుంచి తప్పించుకోబోయి - విగతజీవిగా మారి - young man died in khammam

Last Updated : Apr 10, 2024, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.