ETV Bharat / state

రాజధాని సామగ్రి తరలింపును అడ్డుకున్న సీఆర్డీఏ - గుత్తేదారు సంస్థకు నోటీసులు - CRDA Blocked Material Moving - CRDA BLOCKED MATERIAL MOVING

CRDA Blocked the Movement of Construction Materials in Amaravati: అమరావతి నుంచి నిర్మాణ సామగ్రి తరలింపు విషయంలో సీఆర్డీఏ స్పందించింది. ఎల్​అండ్​టీ సంస్థకు చెందిన స్టాక్​ యార్డ్ నుంచి తరలిస్తున్న సామగ్రిని సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. సీఆర్డీఏకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సామగ్రిని తరలించడం పట్ల సంబంధిత గుత్తేదారు సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు సీఆర్డీఏ తెలిపింది.

crda_blocked_material_moving
crda_blocked_material_moving (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 5:58 PM IST

రాజధాని సామాగ్రి తరలింపును అడ్డుకున్న సీఆర్డీఏ - గుత్తేదారు సంస్థకు నోటీసులు జారీ (ETV Bharat)

CRDA Blocked the Movement of Construction Materials in Amaravati: రాజధాని ప్రాంతం నుంచి నిర్మాణ సామగ్రి తరలింపు వ్యవహారంపై ఎట్టకేలకు సీఆర్డీఏ స్పందించింది. అమరావతి నుంచి తరలిస్తున్న సామగ్రిని సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. అమరావతిలోని తాళ్లాయిపాలెం గ్రామంలో ఉన్న ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన స్టాక్​ యార్డ్ నుంచి తరలిస్తున్న భూగర్భ విద్యుత్తు కేబుళ్లకు అమర్చేందేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ స్పేసర్​లను సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. ఎల్ అండ్ టీ స్టాక్ యార్డ్​లో సీఆర్డీఏ ఇంజినీరింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

సదరు కంటైనర్ వాహనంలో ప్లాస్టిక్ స్పేసర్స్ తరలింపును గుర్తించిన అధికారులు వాటిని అడ్డుకున్నారు. అయితే ప్లాస్టిక్ స్పేసర్​లకు సీఆర్డీఏ ఎలాంటి బిల్లులు చెల్లించలేదని అధికారులు స్పష్టం చేశారు. సీఆర్డీఏకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సామగ్రిని తరలించడం పట్ల సంబంధిత గుత్తేదారు సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు సీఆర్డీఏ తెలిపింది. ఇకపై అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు ఉద్దేశించిన సామగ్రి తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని గుత్తేదారు సంస్థలకు సీఅర్డీఏ స్పష్టం చేసింది.

కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే అరెస్ట్ : సీఈఓ మీనా - CEO Inspected Vote Counting Center

తుక్కు కింద అమ్మేయాలని నిర్ణయం: గత ప్రభుత్వం హయాంలో సంస్థ రాజధానిలో వివిధ నిర్మాణ పనుల కాంట్రాక్టులను దక్కించుకుంది. భారీగా నిర్మాణ సామగ్రిని తీసుకు వచ్చి గోదాములో నిల్వ చేసింది. 2018లో విద్యుత్తు పైపుల మధ్య అమరిక కోసం వాడే ప్లాస్టిక్‌ ఫ్రేములను భారీ పరిమాణంలో తెచ్చి మందడం సమీపంలోని గోదాములో ఉంచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి సామగ్రి అంతా నిరుపయోగంగా ఉంది. ఈ ప్లాస్టిక్‌ ఫ్రేములను తుక్కు కింద అమ్మేయాలని సంస్థ నిర్ణయించిందని చెబుతున్నారు. వీటిని దిల్లీకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం కొంత సరకు తరలినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొత్తం ఐదు కంటైనర్లలో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. వీటిని కొనుగోలు చేసిన వ్యక్తులు దగ్గరుండి మరీ వాటిని తరలిస్తున్నారు.

తాడేపల్లి పీఎస్‌లో సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమ ఫిర్యాదు - Devineni Uma complaint on Sajjala

ప్రభుత్వం స్పందించాలని రైతుల డిమాండ్‌ : ఎల్‌ అండ్‌ టీ నిల్వ కేంద్రం నుంచి సామగ్రిని తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు. భారీ కంటైనర్లలో రాజధాని నుంచి ఎందుకు తరలిస్తున్నారని సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్నందున, అప్పటి వరకు అయినా ఆగాలని కోరారు. ప్రస్తుతానికి తరలింపును నిలిపివేయాలని ప్రాథేయపడ్డారు. అమరావతి నిర్మాణానికి ఆటంకం కలిగించొద్దని వేడుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం తీసుకు వచ్చిన సామగ్రిని గుత్తేదారు సంస్థలు తరలింపుపై ప్రభుత్వం స్పందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రజారోగ్య పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యం- వైఎస్సార్సీపీ పాలనలో అలంకారప్రాయంగా కమాండ్‌ సెంటర్‌ - SANITATION SITUATION IN AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.