ETV Bharat / state

భారీ వర్షాలకు పుట్టపర్తి జలమయం - పిడుగుపాటుకు దంపతులు మృతి - Heavy Rains in Sathya Sai District - HEAVY RAINS IN SATHYA SAI DISTRICT

Heavy Rains in Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దిగువగంగంపల్లితండాలో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Heavy Rains in Sri Sathya Sai District
Heavy Rains in Sri Sathya Sai District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2024, 11:22 AM IST

Heavy Rains in Sri Sathya Sai District : శ్రీ సత్యసాయి రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాలో పిడుగుపడి దంపతులు సహా 2 పాడి ఆవులు మృతి చెందాయి. ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఉదయం కురిసిన భారీ వర్షానికి ఒకే కుటుంబానికి చెందిన దసరా నాయక్‌, దేవిబాయి మృతి చెందగా వారి కుమారుడు జగదీశ్‌ నాయక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని పుట్టపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ప్రభుత్వం తరఫున దంపతులిద్దరికి 8 లక్షలు : పశువులపాకలో ఉండగా పిడుగుపాటుకు గురైనట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై మంత్రి సవిత స్పందించారు. బాధితునికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున దంపతులిద్దరికి 8 లక్షలు, 2 ఆవులకు కలిపి 70 వేలు నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు.

రాత్రి నుంచి పిడుగులతో పాటు వర్షం : పుట్టపర్తిలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రసిద్ధ దేవాలయమైన సత్యమ్మ దేవాలయం చుట్టూ భారీగా వర్షపు నీరు చేరింది. ఆలయానికి వెళ్లడానికి దారి లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి పిడుగులతో పాటు వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలన్నీ మురుగు నీటితో నిండిపోయి రోడ్డుపైకి పొర్లుతున్నాయి. దీంతో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి.

60 ఏళ్లలో చూడని ప్రళయం - వర్షం ధాటికి కొండలు కరిగి ఊర్లనే మింగేసింది - Tribes Problems on Rains

అందాల జలపాతం : మడకశిరలో చాలా రోజుల తరువాత వర్షం కురవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండపై నుంచి ప్రవహిస్తున్న జలపాతం అందాలు చూపరులకు ఆహ్లాదాన్ని కలుగజేసింది. కాలువలు పొంగిపొర్లడంతో రోడ్లు జలమయమయ్యాయి.

ఇళ్లలోకి చేరిన వరద నీరు : హిందూపురంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వేకువ జాము నుంచే ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలు స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని అహ్మద్ నగర్, రైల్వే రోడ్డు, ఆబాద్పేట, బాలాజీ సర్కిల్ రోడ్డు, ముక్కడి పేట, శ్రీకంఠపురం ప్రాంతాలలో ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.

అల్పపీడనాల జోరు- రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు - HEAVY RAINS IN AP

రాళ్లు కూలి, మట్టి కొట్టుకొచ్చి పంటలన్నీ నాశనం - ఆదుకోవాలని గిరిపుత్రుల వేడుకోలు - Rain Effect In Hill Area in Alluri

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.